Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Realme Narzo N55: మొదటి రోజు అమ్మకాల్లో అదరగొట్టిన రియల్‌మీ నార్జో ఎన్55.. బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ జాబితాలో చోటు

ఈ వారం ప్రారంభంలో ఈ ఫోన్‌ను కంపెనీ మొదటిసారిగా అమ్మకానికి తీసుకువచ్చింది. ఈ ఏడాదికి అమెజాన్‌లో రూ. 10,000-రూ. 15,000 ధరల విభాగంలో విక్రయం ప్రారంభమైన మొదటి రోజున అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ నార్జో ఎన్55 నిలిచిందని రియల్ మీ ప్రకటించింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో నార్జో ఎన్55 మొదటి సేల్ సమయంలో 250 శాతం అమ్మకాలు పెరిగాయని పేర్కొంది.

Realme Narzo N55: మొదటి రోజు అమ్మకాల్లో అదరగొట్టిన రియల్‌మీ నార్జో ఎన్55.. బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ జాబితాలో చోటు
Realme Narzo N55
Follow us
Srinu

|

Updated on: Apr 22, 2023 | 7:00 PM

భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ విపరీతంగా పెరిగింది. కరోనా మహమ్మారి తర్వాత స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగింది. ముఖ్యంగా ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు స్మార్ట్ ఫోన్లు ఉండే పరిస్థితి ఉంది. దీంతో కంపెనీలు కూడా కొత్త కొత్త ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్లను అందుబాటులో ఉంచుతున్నాయి. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ ఈ నెల ప్రారంభంలో నార్జో ఎన్55ను మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ వారం ప్రారంభంలో ఈ ఫోన్‌ను కంపెనీ మొదటిసారిగా అమ్మకానికి తీసుకువచ్చింది. ఈ ఏడాదికి అమెజాన్‌లో రూ. 10,000-రూ. 15,000 ధరల విభాగంలో విక్రయం ప్రారంభమైన మొదటి రోజున అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ నార్జో ఎన్55 నిలిచిందని రియల్ మీ ప్రకటించింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో నార్జో ఎన్55 మొదటి సేల్ సమయంలో 250 శాతం అమ్మకాలు పెరిగాయని పేర్కొంది. అయితే కంపెనీ ఎన్ని ఫోన్లను డిస్పాచ్ చేసిందో మాత్రం వెల్లడించలేదు. ఈ ఫోన్ ఛార్జింగ్ స్థితి, లో బ్యాటరీ హెచ్చరిక, డేటా వినియోగం, అలాగే స్టెప్స్, రోజుకు నడిచే దూరం వంటి ముఖ్యమైన సమాచారాన్ని అందించేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఫీచర్‌ ఉందని వారు పేర్కొంటున్నారు. ఈ రియల్‌మీ నార్జో ఎన్ 55 ఫోన్ ప్రైమ్ బ్లాక్, ప్రైమ్ బ్లూ రంగు అందుబాటులో ఉంటుంది. అలాగే 4 జీబీ+64 జీబీ వేరియంట్ ధర రూ.10,999గా ఉంది. అలాగే 6 జీబీ+128 జీబీ ధర రూ.12,999గా ఉంటుంది. ఈ ఫోన్ రియల్ మీ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేస్తే రూ.1000 తగ్గింపు లభిస్తుంది. 

రియల్ మీ నార్జో ఎన్ 55 స్పెసిఫికేషన్లు ఇవే

  • 6.72-అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో 680 నిట్స్ బ్రైట్‌నెస్
  • ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ88 12 ఎన్ఎం ప్రాసెసర్ 
  • 4 జీబీ+ 64 జీబీ, 6 జీబీ+128 జీబీ వేరియంట్లు
  • డ్యూయల్ సిమ్‌తో పాటు రియల్‌మీ యూఐ 4.0 సపోర్ట్‌తో ఆండ్రాయిడ్ 13 సపోర్ట్
  • 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సార్
  • 8 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
  • 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..