AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Mileage Tips: సమ్మర్‌ స్పెషల్.. మీ కార్ మైలేజీని ఈ విధంగా పెంచుకోండి..

వేసవి కాలంలో ప్రజా రవాణాతో పోలిస్తే చాలా మంది తమ సొంత వాహనాల్లో ప్రయాణించడానికి ఇష్టపడుతారు. ముఖ్యంగా ఎండ వేడిమిని తట్టుకోలేక కారులో ప్రయాణించడానికి ఇష్టపడతారు. ఇక ఏ ట్రిప్‌కి వెళ్లాలన్నా, ఆఫీసుకు, కాలేజీకి వెళ్లాలన్నా.. ప్రతి పనికి తమ కారును తీసుకెళ్లేవారు ఎక్కువే ఉంటారు. ఇక పెరుగుతున్న పెట్రోలు, డీజిల్‌ ధరల కారణంగా కొంత మంది భయంతో కారులో..

Car Mileage Tips: సమ్మర్‌ స్పెషల్.. మీ కార్ మైలేజీని ఈ విధంగా పెంచుకోండి..
Auto Tips To Increase Mileage
Shiva Prajapati
|

Updated on: Apr 23, 2023 | 6:19 AM

Share

వేసవి కాలంలో ప్రజా రవాణాతో పోలిస్తే చాలా మంది తమ సొంత వాహనాల్లో ప్రయాణించడానికి ఇష్టపడుతారు. ముఖ్యంగా ఎండ వేడిమిని తట్టుకోలేక కారులో ప్రయాణించడానికి ఇష్టపడతారు. ఇక ఏ ట్రిప్‌కి వెళ్లాలన్నా, ఆఫీసుకు, కాలేజీకి వెళ్లాలన్నా.. ప్రతి పనికి తమ కారును తీసుకెళ్లేవారు ఎక్కువే ఉంటారు. ఇక పెరుగుతున్న పెట్రోలు, డీజిల్‌ ధరల కారణంగా కొంత మంది భయంతో కారులో ప్రయాణించడం మానేస్తారు. కారణం కారు మైలేజీ తక్కువగా ఇవ్వడమే. మరి కారులో తిరిగినా మీ డబ్బు వృధా అవ్వొద్దంటే ఏం చేయాలి? కారు మైలేజీ పెరగాలంటే ఏం చేయాలి? కీలక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

కారు మైలేజీపై గేర్ ప్రభావం చాలా ఉంటుంది..

అన్నింటిలో మొదటిది కారులో గేర్ పనితీరు. ఎలా పని చేస్తాయో తెలుసుకోవాలి. గేర్.. మైలేజీని కూడా ప్రభావితం చేస్తుంది. కారు గేర్.. ఇంజిన్ శక్తిని, వేగాన్ని చక్రాలకు ప్రసారం చేస్తుంది. చాలా వాహనాలు 1 నుండి 5 వరకు గేర్లు, రివర్స్ గేర్ కలిగి ఉంటాయి. కారును బ్యాకింగ్ చేసేటప్పుడు మాత్రమే రివర్స్ గేర్ అవసరం. ఐదవ గేర్‌లో యాక్సిలరేటర్‌ను ఇచ్చినప్పుడు కారు వేగం పెరుగుతుంది. ఐదవ గేర్‌లో వేగం గంటకు 60 నుండి 80 కిమీ ఉంటుంది. కావున హైవేపై కారు మెరుగైన మైలేజీని ఇస్తుంది.

గేర్‌ని పదే పదే ఉపయోగించడం వల్ల ఎక్కువ ఇంధనం కాలుతుంది..

మొదటి గేర్‌లో కారు నడిపితే ఎక్కువ ఇంధన కాలుతుంది. మొదటి గేర్‌లో, టైర్లు అత్యధిక శక్తితో తిరుగుతాయి. తక్కువ భ్రమణాన్ని కలిగి ఉంటాయి. ఆ కారణంగా మొదటి గేర్‌లో ఎక్కువ ఇంధనం కాలుతుంది. అలాగే పదే పదే గేర్లు మార్చడం వల్ల కూడా మైలేజీ తక్కువగా వస్తుంది. అయితే సాధారణ వాహనాలతో పోలిస్తే ఆటోమేటిక్ వాహనాల వ్యవస్థ భిన్నంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మంచి రహదారుల్లో ప్రయాణం..

రహదారులు సరిగా ఉన్న మార్గంలో ప్రయాణించాలి. తద్వారా గేర్లు పదే పదే మార్చాల్సిన అవసరం ఉండదు. మైలేజీ కూడా పెరుగుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..