Viral Video: చదువు కోసం చిన్నారి సాహసం.. ప్రాణం పణంగా పెట్టి నది దాటుతున్న వీడియో చూస్తే షాక్

కొన్ని కొన్ని గ్రామాల్లో రోడ్డు సదుపాయాలుండవు. కాంక్రీట్ ఇళ్లు కనిపించవు, వాగులు వంకలు దాటడానికి ఎటువంటి సదుపాయాలు ఉండవు. ఇలాంటి ప్రదేశంలో చిన్నారుల చదువు అంటే ప్రాణాలను పణంగా పెట్టాల్సిందే. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: చదువు కోసం చిన్నారి సాహసం.. ప్రాణం పణంగా పెట్టి నది దాటుతున్న వీడియో చూస్తే షాక్
Student Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Apr 30, 2023 | 11:43 AM

ప్రపంచం చాలా పురోగతి సాధించింది. మనుషులు అంబరాన్ని తాకుతున్నారు.. సముద్రంలో లోతులు కొలుస్తూ చేపలా ఈదుతున్నాడు. క్షణాల్లో ప్రపంచంలో ఎక్కడ ఎప్పుడు ఏమి జరిగినా తెలుకుంటున్నాడు.  మానవులు చంద్రుడిపై అడుగు పెట్టారు. అంగారక గ్రహంపైకి వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లకు పైగా అయినా.. నేటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ప్రదేశాలు అనేకం ఉన్నాయి. కొన్ని కొన్ని గ్రామాల్లో రోడ్డు సదుపాయాలుండవు. కాంక్రీట్ ఇళ్లు కనిపించవు, వాగులు వంకలు దాటడానికి ఎటువంటి సదుపాయాలు ఉండవు. ఇలాంటి ప్రదేశంలో చిన్నారుల చదువు అంటే ప్రాణాలను పణంగా పెట్టాల్సిందే. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో కొంతమంది అమ్మాయిలు తమ ప్రాణాలను పణంగా పెట్టి పాఠశాలకు వెళ్తున్నారు. ఓ స్కూల్ స్టూడెంట్ నదికి ఇటువైపు నిలబడి నదిని దాటేందుకు ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. నిజానికి నదికి ఇటువైపు నుంచి అటువైపును కలుపుతూ ఒక తాడు కట్టి ఉంది. ఆ తాడు సాయంతో బాలిక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నది దాటింది. ఈ చర్య సాహసం తో కూడినది..  చాలా ప్రమాదకరమైంది. నది దాటే సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాంతకంగా మారవచ్చు, ఎందుకంటే నదిలో నీటి ప్రవాహం చాలా వేగంగా ఉంది. ఎవరైనా నదిలో పడితే క్షణంలో కొట్టుకుపోతారు. అయితే ఈ బాలిక నదిని తాడు సాయంతో చాకచక్యంగా దాటింది. చదువు కోసం తన ప్రాణాలను ప్రమాదంలో పెట్టి మరీ వెళ్తున్న చిన్నారికి చదువు మీద ఉన్న అభిరుచి అందరి ప్రశంసలను పొందుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది @cctvidiots అనే IDతో ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో పిల్లలు పాఠశాలకు వెళ్లడం కోసం తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు’ అనే శీర్షిక ఉంది.

కేవలం 26 సెకన్ల ఈ వీడియోను ఇప్పటి వరకు 10 మిలియన్లకు పైగా వీక్షించగా, 36 వేల మందికి పైగా లైక్ చేసారు. విభిన్న స్పందనలను సొంతం చేసుకుంది. ఇలా స్కూల్‌కి వెళ్లడం ప్రమాదకరమని కొందరు, ‘ఈ చిన్న హీరోకి జీవితాన్ని గడపడం సాహసమే’ అని కొందరు అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు