AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇదే మానవత్వం అంటే..! పంజరంలో పక్షులను కొని స్వేచ్ఛనిచ్చిన యువకుడు.. వీడియో వైరల్

వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక వ్యక్తి పంజరంలో ఉన్న పక్షులను కొని, వాటికి స్వేచ్చని ప్రసాదించాడు.. పంజరంలో ఉన్న పక్షులను ఆకాశంలోకి విడిచాడు. కారులో కూర్చున్న ఓ వ్యక్తి పక్షులకు ఎలా స్వేచ్ఛ ఇస్తున్నాడో వీడియోలో చూడొచ్చు.

Viral Video: ఇదే మానవత్వం అంటే..! పంజరంలో పక్షులను కొని స్వేచ్ఛనిచ్చిన యువకుడు.. వీడియో వైరల్
Video Viral
Surya Kala
|

Updated on: Apr 30, 2023 | 9:35 AM

Share

వివిధ రకాల జంతువులను, పక్షులను ఇష్టపడం మాత్రమే కాదు.. వాటిని పెంచుకుని తమ కుటుంబ సభ్యుల్లా భావించే వారు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. పిల్లులు, కుక్కలు, వంటి జంతువులను మాత్రమే కాదు.. చిలుక, రామ చిలుక వంటి పక్షులను కూడా పెంచుకుంటారు. అయితే తాము పెంచుకునే పక్షులను పంజరంలో ఉంచుతారు. వాటికీ మంచి ఆహారం, నీరుని సమయానికి అందిస్తూ ఎంతో ముద్దు చేస్తారు. అయితే స్వేచ్ఛగా ప్రకృతిలో విహరించే పక్షులు పంజరంలో బందీలుగా మారి మానవులను వినోదాన్ని పంచేవిగా మారతాయి. అయితే పక్షుల స్వేచ్ఛ ను కోరుతూ కొందరు ఉంటారు. వీరు పక్షులను పంజరంలో బంధించి ఉంచడం చూడలేరు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో నెటిజన్ల మనసుని దోచుకుంది.

వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక వ్యక్తి పంజరంలో ఉన్న పక్షులను కొని, వాటికి స్వేచ్చని ప్రసాదించాడు.. పంజరంలో ఉన్న పక్షులను ఆకాశంలోకి విడిచాడు. కారులో కూర్చున్న ఓ వ్యక్తి పక్షులకు ఎలా స్వేచ్ఛ ఇస్తున్నాడో వీడియోలో చూడొచ్చు. ఓ వ్యక్తి అందమైన చిన్న పక్షులను బోనులో బంధించి విక్రయిస్తున్నాడు. సిగ్నల్స్ పడే సమయంలో పక్షులను కార్ల వద్ద ఉన్నవారి దగ్గరకు తీసుకుని వెళ్లి అమ్మకాన్ని ప్రయత్నిస్తున్నాడు. అది కారులో ఉన్న ఒక యువకుడు చూశాడు. వెంటనే ఆ పక్షులను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను అనేక పక్షులను ఒక్కొక్కటిగా కొని వాటిని ఆకాశంలో విడిచిపెట్టాడు. దీంతో ఆ పక్షులు తమ జీవితాంతం స్వేచ్ఛగా జీవించవచ్చు. మంచి మనసున్న వ్యక్తి .. అంటూ నెటిజన్లు ఇష్టపడుతున్నారు.

ఈ అందమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @_B___S అనే IDలో షేర్ చేశారు. ఆ యువకుడు పక్షులను విడిపించడానికి మాత్రమే వాటిని కొనుగోలు చేస్తున్నాడు’ అనే శీర్షికతో ఉంది. కేవలం 13 సెకన్ల ఈ వీడియో 11 మిలియన్లకు పైగా అంటే 1.1 కోట్ల వ్యూస్ ను, 2 లక్షల 65 వేల లైక్స్ ను సొంతం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

అదే సమయంలో ఈ అద్భుతమైన వీడియోను చూసిన తర్వాత, ప్రజలు కూడా విభిన్న స్పందనలు ఇచ్చారు. ‘ఎగరడానికి రెక్కలున్నాయి’ అని ఎవరో చెబుతున్నారు. ఆ పక్షులకు బోనులో ఉండడం ఇష్టం లేదు, ఎగరడానికి స్వేచ్ఛ కావాలి’ .. ఈ యువకుడు చాలా దయగలవాడు. పక్షులను కొని, వాటిని విడిచిపెట్టాడు.. అవి ఎగిరిపోయి సంతోషంగా ఉంటాయి.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటున్నారా?సైన్స్ ఏం చెబుతోంది
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటున్నారా?సైన్స్ ఏం చెబుతోంది
యూట్యూబ్‌లో బంగారం షో.. ఇంటికొచ్చేసరికి అంతా గోవిందా!
యూట్యూబ్‌లో బంగారం షో.. ఇంటికొచ్చేసరికి అంతా గోవిందా!
ఈ ట్రిక్స్ పాటిస్తే ప్రీమియం ఫోన్లు సగం ధరకే!
ఈ ట్రిక్స్ పాటిస్తే ప్రీమియం ఫోన్లు సగం ధరకే!
మీ నగరాన్ని నడిపించేది మేయరా? కమిషనరా?
మీ నగరాన్ని నడిపించేది మేయరా? కమిషనరా?
అన్నం వండే ముందు బియ్యాన్ని ఎందుకు కడగాలి?సైన్స్ చెప్తున్న నిజాలు
అన్నం వండే ముందు బియ్యాన్ని ఎందుకు కడగాలి?సైన్స్ చెప్తున్న నిజాలు
కెరీర్ పీక్‌లో ఉండగానే ఊహించని ట్విస్ట్.. కట్ చేస్తే 31 ఏళ్లకే
కెరీర్ పీక్‌లో ఉండగానే ఊహించని ట్విస్ట్.. కట్ చేస్తే 31 ఏళ్లకే
ఆసియా క్రీడల్లో గోల్డ్ గెలిచిన భారత మహిళల కబడ్డీ జట్టు..
ఆసియా క్రీడల్లో గోల్డ్ గెలిచిన భారత మహిళల కబడ్డీ జట్టు..
స్కూళ్ల దగ్గర వాటిని అమ్మితే కఠిన చర్యలు..? కేంద్రం హెచ్చరిక!
స్కూళ్ల దగ్గర వాటిని అమ్మితే కఠిన చర్యలు..? కేంద్రం హెచ్చరిక!
బ్యాంకులు సంచలన నిర్ణయం.. కస్టమర్లకు భారీ ఊరట..ATM ఛార్జీలు రద్దు
బ్యాంకులు సంచలన నిర్ణయం.. కస్టమర్లకు భారీ ఊరట..ATM ఛార్జీలు రద్దు
కస్టమర్లకు బిగ్‌ అలర్ట్.. సెప్టెంబర్ 28 నుంచి బ్యాంకులు బంద్‌..!
కస్టమర్లకు బిగ్‌ అలర్ట్.. సెప్టెంబర్ 28 నుంచి బ్యాంకులు బంద్‌..!