బంకర్లు, రహస్య గదులు, సొరంగాలు, భూగర్భ గదులు చరిత్ర పుస్తకాలలో చదువుకున్నాం.. ప్రస్తుతం దేశ రక్షణ సమయంలో చేసుకునే ఏర్పాట్ల గురించి తరచుగా వింటూనే ఉన్నాం.. యుద్ధం లేదా ప్రమాద సమయాల్లో తమని తాము రక్షించుకోవడానికి రాజుల నుండి సామాన్యుల వరకు ఈ భూగర్భ మార్గాల్లో లేదా భూగర్భ గదుల్లో ఉంటారు. అయితే దక్షిణాఫ్రికాలోని ఓ నగరంలోని ప్రజలు ఎండల వేడి నుంచి రక్షణ కోసం భూగర్భ గదులను నిర్మించుకున్నారు.