AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking Video: వామ్మో! మనిషి ముఖంతో గబ్బిలం.. పైకప్పుపై వేలాడుతున్న వింత జీవి.. చూస్తే జడుసుకుంటారతే!

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వింత జీవి పైకప్పు నుండి తలక్రిందులుగా గబ్బిలంలా వేలాడుతూ కనిపిస్తుంది. ముఖం మానవుల వలె ఉంటే.. దీని రెక్కలు గబ్బిలంలా ఉన్నాయి. మనుషులు, గబ్బిలాల మిశ్రమ జాతికి చెందిన జీవులను సినిమాల్లో చాలాసార్లు చూసి ఉంటారు.

Shocking Video: వామ్మో! మనిషి ముఖంతో గబ్బిలం.. పైకప్పుపై వేలాడుతున్న వింత జీవి.. చూస్తే జడుసుకుంటారతే!
Human Face And Bat
Surya Kala
|

Updated on: Apr 24, 2023 | 10:49 AM

Share

భూమిపై వేల మిలియన్ల రకాల జీవులు నివసిస్తున్నాయి, వాటిలో కొన్నిటిని మనం రోజూ చూస్తూనే ఉన్నాం.  కొన్నింటిని మనం ఎప్పుడూ చూడలేము. చూసినా.. అది టీవీలోనో, మొబైల్‌లోనో మాత్రమే అయి ఉంటుంది.  ఎందుకంటే చాలా జంతువులు మానవులు అడుగు పెట్టలేని ప్రదేశాలలో నివసిస్తాయి. వాటిని చూసే సామర్థ్యం సామాన్యులకు ఉండదు. అలాంటి జీవులను వింత జీవులు లేదా రహస్య జీవులు అంటూ సామాన్యులు భావిస్తారు. ఒకొక్కసారి అలాంటి జీవులను చూసి శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతారు. ఈ రోజుల్లో అలాంటి వింత జీవికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ జీవిని చూసి ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వింత జీవి పైకప్పు నుండి తలక్రిందులుగా గబ్బిలంలా వేలాడుతూ కనిపిస్తుంది. ముఖం మానవుల వలె ఉంటే.. దీని రెక్కలు గబ్బిలంలా ఉన్నాయి. మనుషులు, గబ్బిలాల మిశ్రమ జాతికి చెందిన జీవులను సినిమాల్లో చాలాసార్లు చూసి ఉంటారు. అయితే వాస్తవానికి ఇలాంటి జీవిని ఎవరూ చూడలేదు. మానవ గబ్బిలం వంటి జీవి సీలింగ్ నుండి తలక్రిందులుగా వేలాడుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఈ జీవిని చూసిన వారికి భయంతో వణుకుతున్నారు. రాత్రిపూట ఎవరైనా చూస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించనైనా ఊహించలేరు.

ఇవి కూడా చదవండి

మనిషి గబ్బిలంలా కనిపించే ఈ జీవి నిజమా…  ఫోటోషాప్ సాయంతో రూపొందించినదా లేదా సినిమా సీన్  అనే విషయంపై సరైన సమాచారం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. . ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @TerrifyingNatur అనే IDతో షేర్ చేశారు.  ‘మేము సాధారణంగా గబ్బిలాలను చూస్తూనే ఉంటాం.. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న జీవి భయానకంగా ఉంది!’

కేవలం 9 సెకన్ల ఈ వీడియో ఇప్పటివరకు 3 మిలియన్లకు పైగా అంటే 30 లక్షల సార్లు వీక్షించారు.  63 వేల మందికి పైగా వీడియోను లైక్ చేసారు. భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. కొందరు దీనిని పిశాచం అని, మరికొందరు డ్రాక్యులా అని పిలుస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
జీమెయిల్ వాడేవారికి ఇక పండగే.. స్టన్నింగ్ ఫీచర్ తెచ్చిన గూగుల్
జీమెయిల్ వాడేవారికి ఇక పండగే.. స్టన్నింగ్ ఫీచర్ తెచ్చిన గూగుల్