Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lion-Like Calf: ఓ ఆవుకు వింత దూడ జననం.. సింహం రూపంలో దూడ.. క్యూ కట్టిన జనం..ఎక్కడో తెలుసా

ప్రకృతి మనిషిని ఆశ్చర్యపరిచే విధంగా అరుదైన వింత సంఘటన జరిగింది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలో ఓ ఆవు వింత దూడకు జన్మనిచ్చింది. ఆవు దూడ సింహం పిల్లను పోలినట్లు ఉండి అందరికీ షాక్ ఇచ్చింది.

Lion-Like Calf: ఓ ఆవుకు వింత దూడ జననం.. సింహం రూపంలో దూడ.. క్యూ కట్టిన జనం..ఎక్కడో తెలుసా
Lion Like Calf
Follow us
Surya Kala

|

Updated on: Apr 29, 2023 | 11:48 AM

భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను, విషయాలను వింతలను ముందుగానే దర్శించి వాటిని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో  తాళపత్ర గ్రంథాలలో భద్రపరచారు. ప్రస్తుతం ఎక్కడ ఏ వింత జరిగినా వెంటనే బ్రహ్మంగారు చెప్పినట్లు జరిగిందే అని అనుకుంటారు. అంతేకాదు కలికాలం ఇలాంటి వింతలే జరుగుతాయి. అయినా ఇదంతా ఎప్పుడో బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. అవి ఇప్పుడు నిజమవుతున్నాయి అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రకృతి మనిషిని ఆశ్చర్యపరిచే విధంగా అరుదైన వింత సంఘటన జరిగింది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలో ఓ ఆవు వింత దూడకు జన్మనిచ్చింది. ఆవు దూడ సింహం పిల్లను పోలినట్లు ఉండి అందరికీ షాక్ ఇచ్చింది. నమ్మశక్యం కాని వార్త ఆ ప్రాంతంలో వ్యాపించడంతో వింత దూడను చూసేందుకు గ్రామస్థులు క్యూ కట్టారు.

రైతు నత్తులాల్ శిల్పాకర్ కు చెందిన ఆవుకు సింహం రూపంలో ఉన్న ఓ వింత దూడ జన్మించింది. ఈ వింత దూడను చూడడానికి గ్రామస్థులు క్యూ కట్టారు. ఈ విషయంపై వెటర్నరీ డిపార్ట్‌మెంట్ సిబ్బంది మాట్లాడుతూ.. ఆవు గర్భాశయంలో లోపం కారణంగానే  ఇలాంటి దూడ పుట్టిందని చెప్పారు. దూడ పుట్టినప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ.. పుట్టిన ముప్పై నిమిషాల్లోనే మృత్యువాత పడింది.

ఇవి కూడా చదవండి

పశువైద్యాధికారి ఎన్‌కే తివారీ మాట్లాడుతూ.. ఆవు గర్భంలో ఉన్న లోపం వల్లే ఈ తరహా దూడకు జన్మనిచ్చిందన్నారు. ఇది ప్రకృతి అద్భుతం కాదని చెప్పారు. ఆవు గర్భంలోని “పిండం సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం వల్ల ఇటువంటి సమస్య ఏర్పడినట్లు పేర్కొన్నారు.

సింహం ఆకారంలో చనిపోయిన దూడను చూసేందుకు గూర్ఖా గ్రామంలో సందడి నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు క్యూ కట్టారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..