Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CCTV Footage: రెచ్చిపోయిన దొంగలు.. పట్టపగలు వ్యక్తిపై దాడి, దారి దోపిడీ.. వీడియో వైరల్

సీలంపూర్‌ ప్రాంతలోని ఓ వీధిలో రవీందర్‌సింగ్‌ నడుచుకుంటూ వెళ్తున్నాడు. మెయిన్‌ రోడ్డుకు చేరుకునే క్రమంలో ఓ వ్యక్తి అతడిని ఎటాక్‌ చేశాడు. అతడిని కదలకుండా బంధించి పక్కనే ఉన్న ఓ చిన్నాపాటి అరుగుపైకి లాక్కెళ్లాడు. ఇంతలో మరో వ్యక్తి వచ్చి బాధితుడి జేబులోంచి నగదు, ఇతర వస్తువులను తీసుకొని, ఇద్దరూ పరారయ్యారు.

CCTV Footage: రెచ్చిపోయిన దొంగలు.. పట్టపగలు వ్యక్తిపై దాడి, దారి దోపిడీ.. వీడియో వైరల్
Caught On Camera
Follow us
Surya Kala

|

Updated on: Apr 28, 2023 | 12:51 PM

ఢిల్లీలో పట్టపగలే దుండగులు రెచ్చిపోయారు. సీలంపూర్‌లో రోడ్డుపై నడిచివెళ్తున్న వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. అతని వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్‌ ఎత్తుకుని పారిపోయారు. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీటీవీ లో రికార్డ్  అయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. జీ-బ్లాక్ సీలంపూర్ సమీపంలో ఇదద్రు వ్యక్తులు రవీందర్ సింగ్ అనే 18 ఏళ్ల యువకుడిపై దాడి చేసి దోచుకున్నారు. సీలంపూర్‌ ప్రాంతలోని ఓ వీధిలో రవీందర్‌సింగ్‌ నడుచుకుంటూ వెళ్తున్నాడు. మెయిన్‌ రోడ్డుకు చేరుకునే క్రమంలో ఓ వ్యక్తి అతడిని ఎటాక్‌ చేశాడు. అతడిని కదలకుండా బంధించి పక్కనే ఉన్న ఓ చిన్నాపాటి అరుగుపైకి లాక్కెళ్లాడు. ఇంతలో మరో వ్యక్తి వచ్చి బాధితుడి జేబులోంచి నగదు, ఇతర వస్తువులను తీసుకొని, ఇద్దరూ పరారయ్యారు.

యువకుడిని గట్టిగా అదిమి పట్టడంతో స్పృహతప్పినట్టు తెలుస్తోంది. ఆ యువకుడు చలనం లేకుండా కింద పడిపోయాడు. ఈ ఘటన అంతా సమీపంలో అమర్చిన సెక్యూరిటీ కెమెరాలో రికార్డైంది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ పుటేజీ ఆధారంగా నిందితులను నజీమ్‌, షరాపత్‌గా పోలీసులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

పట్టపగలు దారిదోపిడీకి పాల్పడిన ఇద్దరిని నేరం జరిగిన కొన్ని గంటల్లోనే అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. కాగా నిందితుడు నజీమ్‌పై క్రిమినల్‌ కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. గతంలోనూ అతను దారిదోపిడీ, దొంగతనం ఆరోపణలతో అరెస్టయ్యాడని వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..