25 ఏళ్లుగా విడిగా ఉండి విడాకుల కోసం వెళ్లిన జంట.. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పేంటంటే
పెళ్లి చేసుకున్న తర్వాత జీవితాంతం కలిసి ఉండేవాళ్లు ఉంటారు. అలాగే మధ్యలోనే విడాకులు తీసుకొని విడేపోయేవాళ్లు ఉంటారు. అయితే ఢిల్లీకి చెందిన ఓ జంట పెళ్లి చేసుకుని కేవలం నాలుగు సంవత్సారాలే కలిసి ఉన్నారు. ఆ తర్వాత దాదాపు 25 ఏళ్లు ఒకరికొకరు దూరంగా ఉన్నారు.

పెళ్లి చేసుకున్న తర్వాత జీవితాంతం కలిసి ఉండేవాళ్లు ఉంటారు. అలాగే మధ్యలోనే విడాకులు తీసుకొని విడేపోయేవాళ్లు ఉంటారు. అయితే ఢిల్లీకి చెందిన ఓ జంట పెళ్లి చేసుకుని కేవలం నాలుగు సంవత్సారాలే కలిసి ఉన్నారు. ఆ తర్వాత దాదాపు 25 ఏళ్లు ఒకరికొకరు దూరంగా ఉన్నారు. ఇక విడాకుల కోసం సుప్రీంకోర్టుకు వెళ్తే ఎట్టకేలకు ధర్మాసనం తీర్పు చెప్పింది. వాళ్లిద్దరని ఇక నుంచి దంపతులుగా విడిపోవడమే మంచిదని జస్టీస్ సుదాన్షు దులియా, జేబీ పర్దివాలాతో కూడిన ధర్మాసనం తేల్చిచెప్పింది. ఎక్కవ కాలం దూరంగా ఉండటం, సహజీవనం లేకపోవడం, అర్ధవంతమైన బంధాలను తెంచుకోవడం హిందూ వివాహ చట్టం ప్రకారం కలిపి ఉంచలేమని.. ఇది క్రూరత్వంగా భావించబడుతుందని పేర్కొంది. ఆ దంపతులకు పిల్లలు కూడా లేరు కాబట్టి వాళ్లు విడిపోవడం వల్ల వాళ్లపైనే ప్రభావం చూపుతుందని తెలిపింది. భర్త నెలకు రూ.లక్ష సంపాదిస్తాడు కాబట్టి.. తన భార్యకు నాలుగు వారాల్లో రూ. 30 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.
అయితే ఈ జంట 1994లో ఢిల్లీలో వివాహం చేసుకున్నారు. అదే ఏడాది తన భార్య తనకు చెప్పకుండా అబార్షన్ చేయించుకుందని భర్త ఆరోపించాడు. తన ఇల్లు చిన్నగా ఉన్నందున ఆ ఇంటిని కూడా మెచ్చేది కాదని తెలిపాడు. నాలుగేళ్ల తర్వాత ఆ మహిళ అతడ్ని విడిచి వెళ్లిపోయింది. అలాగే అతనిపై వరకట్న వేధింపు కేసు పెట్టింది. ఆమె భర్త.. అతని సోదరుడు అరెస్టై బెయిల్ పై విడుదలయ్యారు. ఆ తర్వాత అతను విడాకుల కోసం ఢిల్లీ కోర్టును ఆశ్రయించాడు. కానీ ఆ కోర్టు విడాకుల అభ్యర్థనను తోసిపుచ్చింది. ఆ తర్వాత అతను సుప్రీంకోర్టులు ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేశాడు. చివరికి సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..