Operation Kaveri: శరవేగంగా కొనసాగుతోన్న ఆపరేషన్ కావేరి.. ఇప్పటివరకు స్వదేశానికి సురక్షితంగా 670 మంది
సూడాన్ నుంచి భారతీయుల తరలింపు కోసం చేపట్టిన ఆపరేషన్ కావేరి వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 670 మంది భారతీయులను స్వదేశానికి తరలించారు. సూడాన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు మరింత వేగంగా కొనసాగుతోంది. తాజాగా 246 మంది భారతీయులను ప్రత్యేక విమానంలో...

సూడాన్ నుంచి భారతీయుల తరలింపు కోసం చేపట్టిన ఆపరేషన్ కావేరి వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 670 మంది భారతీయులను స్వదేశానికి తరలించారు. సూడాన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు మరింత వేగంగా కొనసాగుతోంది. తాజాగా 246 మంది భారతీయులను ప్రత్యేక విమానంలో ముంబైకి తీసుకొచ్చారు. కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు సూడాన్ నుంచి తిరిగి వచ్చిన భారతీయులు. ఎయిర్‌ఫోర్స్ విమానంలో భారతీయులను ముంబైకి తీసుకొచ్చారు
బుధవారం రాత్రి కూడా భారతీయులకు సూడాన్ నుంచి తీసుకొచ్చారు. 297 మందిని తరలించారు. ఇప్పటివరకు దాదాపు 670 మందిని మందిని సూడాన్ నుంచి స్వదేశానికి తరలించారు. సూడాన్‌లో ఇంకా 2400 మంది వరకు భారతీయులు చిక్కుకున్నట్టు విదేశాంగశాఖ వెల్లడించింది. సూడాన్ రాజధాని ఖార్తోం వరకు వాళ్లంతా చేరుకుంటే స్వదేశానికి చేర్చడం సాధ్యమవుతందని తెలిపింది. చాలామంది భారతీయులు అంతర్యుద్దం జరుగుతున్న ప్రాంతాల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. స్వదేశం రావడానికి 3400 భారతీయులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. సూడాన్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం ఢిల్లీలో విదేశాంగ శాఖ కార్యాలయంలో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
సహాయక చర్యల కోసం రెండు సీ-130 వాయుసేన విమానాలు, మూడు నావికాదళ నౌకలు .. INS సుమేధ, INS తేగ్, INS తర్కష్‌ను ఉపయోగిస్తున్నారు. యుద్ధ సమయంలో డీజిల్, పెట్రోల్ కొరత సహా తరలింపు ప్రక్రియలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ భారతీయుల కోసం ఖార్తుం నుంచి బస్సులు ఏర్పాటు చేశారు. ఖార్తుం నుంచి పోర్ట్ సూడాన్ కు, అక్కడి నుంచి జెడ్డాకు, అక్కడి నుంచి భారత్ కు.. ఇలా తరలింపు ప్రక్రియ సాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 600 మంది భారతీయులను ఢిల్లీ, ముంబై నగరాలకు తరలించారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..