Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సిసోడియా కస్టడీ పొడిగింపు
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాకు జ్యుడీషియల్ కస్టడీ మే 12వ తేదీ వరకు పొడిగించింది ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు. మనీశ్ సిసోడియా జ్యడీషియల్ కస్టడీ నేటితో ముగిసింది.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాకు జ్యుడీషియల్ కస్టడీ మే 12వ తేదీ వరకు పొడిగించింది ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు. మనీశ్ సిసోడియా జ్యడీషియల్ కస్టడీ నేటితో ముగిసింది. కస్టడీ ముగియడంతో మనీశ్ సిసోడియాను అధికారులు కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉన్నందున సిసోడియా కస్టడీ పొడిగించాలని రౌస్ అవెన్యూ కోర్టును సీబీఐ కోరింది. సీబీఐ వాదనను పరిగణలోకి తీసుకుని సిసోడియా కస్టడీని పొడిగించింది నాగ్ పాల్ ధర్మాసనం. లిక్కర్ స్కాం సీబీఐ కేసులో ఫిబ్రవరి 26న మనీశ్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నేనున్నా.. అంటూ అమ్మానాన్నకు భరోసా ఇస్తున్న బాలుడు.. మెచ్చుకుంటున్న నెటిజన్లు
తల చూస్తే మొసలి..శరీరం చూస్తే చేప.. డేంజరస్ జీవి..
పిల్లితో బలవంతంగా కాలిముద్రలు.. కష్టం పగవాడికి కూడా రాకూడదంటున్న నెటిజన్లు
Jr NTR: ఎన్టీఆర్ గ్లోబల్ ఆఫర్.. రివీల్ చేసిన హాలీవుడ్ డైరెక్టర్