నేనున్నా.. అంటూ అమ్మానాన్నకు భరోసా ఇస్తున్న బాలుడు.. మెచ్చుకుంటున్న నెటిజన్లు
పిల్లలే తల్లిదండ్రులకు సర్వస్వం. బిడ్డల శ్రేయస్సు కోసం తల్లిదండ్రులు అహర్నిశలూ శ్రమిస్తారు. బిడ్డల ఎదుగుదలను చూసి వారి కష్టాన్ని మర్చిపోతారు. అలాగే కొందరు పిల్లలు కూడా తల్లిదండ్రుల పట్ల అంతే ప్రేమను కలిగి ఉంటారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు భరోసాగా నిలుస్తారు.
పిల్లలే తల్లిదండ్రులకు సర్వస్వం. బిడ్డల శ్రేయస్సు కోసం తల్లిదండ్రులు అహర్నిశలూ శ్రమిస్తారు. బిడ్డల ఎదుగుదలను చూసి వారి కష్టాన్ని మర్చిపోతారు. అలాగే కొందరు పిల్లలు కూడా తల్లిదండ్రుల పట్ల అంతే ప్రేమను కలిగి ఉంటారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు భరోసాగా నిలుస్తారు. తాజాగా ఓ బుడ్డోడు తన తల్లిదండ్రులకు అలాంటి భరోసానే ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ చిన్నారి చేసిన పని నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ బుడ్డోడు ఏంచేశాడంటే.. అమ్మానాన్నలతో కలిసి సైకిల్‌పైన ఎక్కడికో వెళ్తున్నాడు. అమ్మ సైకిల్ వెనుకవైపు కూర్చుంటే, ఈ బుడ్డోడు ముందు కూర్చుని ముగ్గురూ సైకిల్‌పైన వెళ్తున్నారు. మార్గమధ్యలో ఓ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ వచ్చింది. నాన్న ఆ ఎత్తయిన బ్రిడ్జిపైకి సైకిల్‌ను తొక్కడానికి కష్టపడుతున్నాడు. సైకిల్ ముందుకు వెళ్లడంలేదు. దాంతో బుడ్డోడు సైకిల్ దిగి వెనకనుంచి సైకిల్‌ను నెట్టుతుంటే తండ్రి సైకిల్ తొక్కుతూ ముందుకు సాగారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తల చూస్తే మొసలి..శరీరం చూస్తే చేప.. డేంజరస్ జీవి..
పిల్లితో బలవంతంగా కాలిముద్రలు.. కష్టం పగవాడికి కూడా రాకూడదంటున్న నెటిజన్లు
Jr NTR: ఎన్టీఆర్ గ్లోబల్ ఆఫర్.. రివీల్ చేసిన హాలీవుడ్ డైరెక్టర్
Ram Charan: జపాన్‌లో దద్దరిల్లేలా చరణ్ తుఫాన్ !!
Karthik Varma Dandu: బంపర్ ఆఫర్ పట్టిన విరూపాక్ష డైరెక్టర్..