AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shirdi: సాయినాథుని దర్శనం కోసం షిర్డీ వెళ్తున్నారా?. అయితే మీకో అలర్ట్‌..!

Shirdi: సాయినాథుని దర్శనం కోసం షిర్డీ వెళ్తున్నారా?. అయితే మీకో అలర్ట్‌..!

Janardhan Veluru
|

Updated on: Apr 28, 2023 | 1:47 PM

Share

Shirdi Sai Baba Temple: మీరైనా, మీకు తెలిసిన వాళ్లైనా షిర్డీ వెళ్తున్నారా?. అయితే మీకో అలర్ట్‌. ఇది తెలుసుకోకుండా షిర్డీ గాని వెళ్లారంటే చిక్కుల్లో పడటం ఖాయం. అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. నేరుగా విషయంలోకి వెళ్తే..

Sai Baba Temple: మీరైనా, మీకు తెలిసిన వాళ్లైనా షిర్డీ వెళ్తున్నారా?. అయితే మీకో అలర్ట్‌. ఇది తెలుసుకోకుండా షిర్డీ గాని వెళ్లారంటే చిక్కుల్లో పడటం ఖాయం. అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. నేరుగా విషయంలోకి వెళ్తే.. అత్యంత సంపన్న ఆలయాల్లో షిర్డి సాయిబాబా టెంపుల్‌ ఒకటి. నిత్యం లక్షలాది భక్తులు షిర్డిసాయిని దర్శించుకుంటూ ఉంటారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీస్‌ వరకూ అందరూ ఆయన భక్తులే. కోట్లాదిమంది ఆయన్ను ఆరాధారిస్తారు. అంతటి మహిమాన్వితమైన షిర్డీ సాయికే ఇప్పుడు నిరసన సెగ తప్పడం లేదు. అవును, మే ఫస్ట్‌ నుంచి షిర్డీలో నిరవధిక బంద్‌కి పిలుపునిచ్చారు స్థానికులు. షిర్డి సాయిబాబా టెంపుల్‌కి CISFతో భద్రత కల్పించాలన్న నిర్ణయంపై మండిపడుతున్నారు. సాయి సంస్థాన్‌, మహారాష్ట్ర పోలీసులు కలిసి తీసుకున్న ఈ నిర్ణయంపై అభ్యంతరం చెబుతున్నారు షిర్డీ వాసులు.

షిర్డీ టెంపుల్‌కి ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందన్న హెచ్చరికలతో భద్రతను రెట్టింపు చేశారు మహారాష్ట్ర పోలీసులు. నిత్యం బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలతో కట్టుదిట్టంగా ఉంటుంది అక్కడి సెక్యూరిటీ అరేంజ్‌మెంట్స్‌. అయితే, ఇది సరిపోదు, CISFతో భద్రత కల్పించాలన్న ప్రతిపాదన రావడంతో దానికి ఓకే చెప్పింది సాయి సంస్థాన్‌. ఇదే ఇప్పుడు వివాదానికి దారి తీసింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందేనంటూ మే ఫస్ట్‌ నుంచి నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చారు స్థానికులు.

నిరవధిక బంద్‌ పిలుపుతో షిర్డీసాయి భక్తులకు సూచనలు చేశారు అధికారులు. బంద్‌ జరిగినా ఆలయం తెరిచే ఉంటుందని, భక్తులంతా యథావిధిగా సంస్థాన్‌లో బస చేయొచ్చని తెలిపింది. సాయిబాబా ప్రసాదాలయం, క్యాంటీన్‌ కూడా కొనసాగుతాయని క్లారిటీ ఇచ్చింది. సాయి సంస్థాన్‌లో ప్రస్తుతం అందుతోన్న సౌకర్యాలన్నీ యాజటీజ్‌గా కంటిన్యూ అవుతాయని వెల్లడించింది. కానీ, బంద్‌ కారణంగా ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది సాయి సంస్థాన్‌. మరి, షిర్డీ వెళ్లే భక్తులు బంద్‌ గురించి అప్‌టుడేట్‌ లేకపోతే మాత్రం ఇబ్బందిపడటం ఖాయం.

Published on: Apr 28, 2023 01:47 PM