AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: నాకు వయస్సు అనేది ఒక నెంబర్ మాత్రమే..

Chandrababu: నాకు వయస్సు అనేది ఒక నెంబర్ మాత్రమే..

Phani CH
|

Updated on: Apr 28, 2023 | 1:48 PM

Share

చాలామంది నా వయస్సు గురించి మాట్లాడుతున్నారు. నా స్పీడ్ తట్టుకోగలరా అని అంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. నాకు వయస్సు అనేది ఒక నెంబర్‌ మాత్రమే అన్నారాయన. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ ఓటమి ఖాయమని అన్నారు చంద్రబాబు.

చాలామంది నా వయస్సు గురించి మాట్లాడుతున్నారు. నా స్పీడ్ తట్టుకోగలరా అని అంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. నాకు వయస్సు అనేది ఒక నెంబర్‌ మాత్రమే అన్నారాయన. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ ఓటమి ఖాయమని అన్నారు చంద్రబాబు. తాడికొండ నియోజక వర్గంలో రోడ్‌షో నిర్వహించిన చంద్రబాబు.. కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. సీఎం జగన్‌ వై నాట్ 175 అంటున్నారు. తాము పులివెందులలో టీడీపీ జెండా ఎగురవేయబోతున్నామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఓటుకు నోటు రాజకీయం పోతే స్వచ్చమైన రాజకీయాలు వస్తాయన్న ఆయన.. అప్పుడే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏపీని నాశనం చేసిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. మూడు రాజధానులు అంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎందుకు ఈ ప్రస్థావన తీసుకు రాలేదన్నారు. అమరావతి రాజధానే అన్న చంద్రబాబు మూడు రాజధానులు అన్నది జరగబోదన్నారు. ఒకప్పుడు తెలంగాణలో ఎకరా భూమి అమ్మితే ఏపీలో ఐదారు ఎకరాల భూమి కొనే వారు. కాని ఇప్పుడు సీన్‌ రివర్స్ అయ్యింది. హైదరాబాద్‌ అభివృద్ధి కోసం తాము తీసుకున్న నిర్ణయాలు హైదరాబాద్ చుట్టుపక్కల భూములు రేట్లు అసాధారణ స్థాయిలో పెరిగేలా చేశాయని అన్నారు చంద్రబాబు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vizag RK Beach Incident: శ్వేతను లైంగిక వేధింపులకు గురిచేసిన ఆడపడుచు భర్త సత్యం !!

ఏడాదికి అర కోటి జీతం.. అయినా జీవితంలో వెలితి !!

Grey Hair: నెరిసిన వెంట్రుకలు మళ్లీ నల్లబడేలా..

మొబైల్‌ చూస్తూ ట్రైన్‌ నడిపిన మహిళ.. తరువాత ??

వంతెనపై ఆయిల్‌ ట్యాంకర్‌ బ్లాస్ట్‌ !! ఏంజరిగిందంటే ??

బైక్‌పై వస్తారు.. పుటుక్కున తెంచేస్తారు !! రోడ్డుమీదే కాదు ఇళ్లలోనూ !!

 

Published on: Apr 28, 2023 01:48 PM