బైక్‌పై వస్తారు.. పుటుక్కున తెంచేస్తారు !! రోడ్డుమీదే కాదు ఇళ్లలోనూ !!
గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. రోడ్లమీదే కాదు ఇప్పుడు ఇళ్లలోకీ చొరబడుతున్నారు. ఒంటరిగా కనిపించిన మహిళల మెడల్లోని నగలను లాక్కెళ్లిపోతున్నారు. ఇటీవల అనంతపురంలో ఉదయాన్నే ఇంటిముందు వాకిలి ఊడ్చుతున్న మహిళను అడ్రస్ అడిగినట్టే అడిగా ఆమె మెడలోని గొలుసు..
గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. రోడ్లమీదే కాదు ఇప్పుడు ఇళ్లలోకీ చొరబడుతున్నారు. ఒంటరిగా కనిపించిన మహిళల మెడల్లోని నగలను లాక్కెళ్లిపోతున్నారు. ఇటీవల అనంతపురంలో ఉదయాన్నే ఇంటిముందు వాకిలి ఊడ్చుతున్న మహిళను అడ్రస్ అడిగినట్టే అడిగా ఆమె మెడలోని గొలుసు లాక్కొని బైక్‌పైన పారిపోయారు దొంగలు. సేమ్ సీన్ ఇప్పుడు గుంటూరు జిల్లాలో జరిగింది. రోడ్డు పక్కనే ఓ అపార్ట్ మెంట్ ఉంది. అందులోకి ఓ మహిళ వెళ్లింది. ఆమె అక్కడ లిఫ్ట్ ఎక్కేందుకు ఒంటరిగా వెయిట్ చేస్తోంది. ఇంతలో బ్లూ కలర్ టీషర్ట్ వేసుకున్న ఓ యువకుడు అక్కడికి వచ్చాడు. కాసేపు ఆటూ ఇటూ టచ్చాడాడు. తన పార్ట్‌నర్‌ని రమ్మని సైగ చేసాడు. దాంతో స్కూటీపైన మరో యువకుడు వచ్చి ఆ బిల్డింగ్ గేటు ముందు ఆగాడు. బ్లూ టీషర్ట్ వేసుకున్న యువకుడు లోపలికి వచ్చాడు. లిఫ్ట్ దగ్గర ఒంటరిగా ఉన్న మహిళ మెడలోని గొలుసు లాక్కొని పరుగెత్తాడు. అక్కడ మరో యువకుడు స్టార్ట్ చేసి రెడీగా ఉన్న స్కూటీ ఎక్కి ఇద్దరూ పారిపోయారు. కృష్ణ నగర్ లోని క్రాస్ రోడ్స్ అపార్ట్మెంట్ లో మూడు రోజుల క్రితం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఊహించని ఘటనతో షాక్‌తిన్న మహిళ తేరుకుని ఆ యువకుడిని వెంబడించింది కానీ ఫలితం లేకపోయింది. చేసేదిలేక లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పట్టాభిపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చెయిన్ స్నాచింగ్ దృశ్యాలు అక్కడి సిసి కెమెరా ల్లో రికార్డు అయ్యాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లగేజ్‌తో వెళ్తూ కిందపడిపోయిన వ్యక్తి !! ఆ తర్వాత..
రెండేళ్ల చిన్నారికి అరుదైన గుర్తింపు.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో..
సింహం బారినుంచి ఆవులమందను కాపాడిన కుక్క !!
మంచినీళ్లకోసం రైలుదిగాడు.. కట్‌చేస్తే 22 ఏళ్లకు ఇంటికి చేరాడు
20 ఏళ్ల కింద చంపేశా.. కలలోకి వచ్చి హింసిస్తున్నాడు !!
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్నెస్..!
అక్కడ కొండచిలువల వేట చాలా ఫేమస్!
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్ జామ్.. ఎక్కడ? ఎప్పుడు?
క్లీనర్, కార్ వాషర్గా చిన్న పనులు చేసి.. కోట్లు సంపాదించాడు
కాంబ్లీ నుంచి కోహ్లీ వరకు.. ముంబై టాప్ ఏరియాల్లో ఖరీదైన ఇళ్లు!
అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ
ఒక్క ‘బిర్యానీ’ కామెంట్‌తో ఉద్యోగం పోయింది..

