AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

viral video: వావ్ ఏం పాడవ్ బాస్..! ఖాకీ గొంతులో కోకిల గానం.. పాట విని మీ ప్రియమైన వారికి అంకితం చేసుకోండి..!!

అర్జిత్‌ సింగ్‌ పాడిన పాటను సోషల్ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌గా మారింది. ఆన్‌లైన్‌లో మిలియన్ల మంది హృదయాలను కొల్లగొట్టింది. చెవులకు నిజంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. పైగా ఈ వీడియోకి క్యాప్షన్‌గా  మీ ప్రియమైన వారిని ట్యాగ్ చేయండి. అంటూ రాశారు..

viral video: వావ్ ఏం పాడవ్ బాస్..! ఖాకీ గొంతులో కోకిల గానం.. పాట విని మీ ప్రియమైన వారికి అంకితం చేసుకోండి..!!
Delhi Cop
Jyothi Gadda
|

Updated on: Apr 28, 2023 | 3:28 PM

Share

సోషల్ మీడియా అనేది ఇప్పుడు చాలా మందికి తమలోని ప్రతిభను ప్రదర్శించడానికి చక్కటి వేదికగా మారింది. డ్యాన్సులు, పాటలు పాడటం, ఇతర నైపుణ్యానికి సంబంధించిన వ్యక్తుల అనేక రికార్డింగ్‌లను ఇక్కడ పోస్ట్‌ చేస్తుంటారు. అవి చూసిన జనం లైకులు, షేర్లు చేయటం వల్ల కొందరు రాత్రి రాత్రికే ఫేమస్‌ అవుతున్న సంఘటనలు కూడా అనేకం చూశాం. అయితే ఇటీవలి వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక పోలీస్‌ అధికారి పాడిన పాట అందరినీ ఆకట్టుకుంటోంది. అతని గొంతులోంచి వచ్చిన రాగానికి ప్రజలు ఫిదా అవుతున్నారు. ఇలాంటి వీడియోలు చూస్తుంటే పోలీసుల్లోనూ మాంచి కళాపోషకులు ఉన్నారని ఖచ్చితంగా అర్థమవుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే, వీడియోలో కనిపించిన ఆ పోలీస్‌ ఆఫీసర్‌ ఢిల్లీకి చెందిన వ్యక్తిగా తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఖాళీగా ఉన్న ఒక పార్కింగ్ స్థలంలో ఢిల్లీకి చెందిన పోలీసు అధికారి అర్జిత్‌ సింగ్‌ తన శ్రావ్యమైన స్వరంతో అద్భుతంగా పాడుతున్నాడు. లాల్‌ సింగ్‌ చద్దా అనే హిందీ సినిమాలోని తేరే హవాలే పాట పాడుతూ అందరినీ మైమరచిపోయేలా చేశాడు. అర్జిత్‌ సింగ్‌ పాడిన పాటను సోషల్ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌గా మారింది. ఆన్‌లైన్‌లో మిలియన్ల మంది హృదయాలను కొల్లగొట్టింది. చెవులకు నిజంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. పైగా ఈ వీడియోకి క్యాప్షన్‌గా  మీ ప్రియమైన వారిని ట్యాగ్ చేయండి. అంటూ రాశారు..

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను 2 మిలియన్లకు పైగా వీక్షించారు. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఫిదా అవ్వాల్సిందే. ఎందుకంటే అతడి గాత్రం అంత మధురంగా ఉంది. మిమ్మల్ని ఖచ్చితంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది.

ఢిల్లీ కాప్ అర్జిత్‌ సింగ్‌ తన సంగీత ప్రతిభతో వైరల్‌ కావడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా అతని అనేక పాటలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ వేదికగా నెటిజన్ల ప్రశంసలు పొందాయి. అనేక వ్యూస్‌తో నెట్టింట హల్‌చల్‌ చేశాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
Video: వైడ్‌ ఇచ్చిన అంపైర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన చైనామన్..!
Video: వైడ్‌ ఇచ్చిన అంపైర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన చైనామన్..!
డీజేలో మోత మోగిపోతున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..
డీజేలో మోత మోగిపోతున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..
ఆన్‌లైన్‌ టికెట్ బుకింగ్‌లో లోయర్ బెర్త్ రాలేదా..? ఇలా చేస్తే..
ఆన్‌లైన్‌ టికెట్ బుకింగ్‌లో లోయర్ బెర్త్ రాలేదా..? ఇలా చేస్తే..
పుష్ప లాంటి సినిమా.. మరో ఓటీటీలోకి వచ్చిన సునీల్ సూపర్ హిట్ మూవీ
పుష్ప లాంటి సినిమా.. మరో ఓటీటీలోకి వచ్చిన సునీల్ సూపర్ హిట్ మూవీ
చేతులెత్తేసిన గిల్ సేన.. 24 ఏళ్ల చెత్త రికార్డులో మనోళ్లు
చేతులెత్తేసిన గిల్ సేన.. 24 ఏళ్ల చెత్త రికార్డులో మనోళ్లు
ఆపదలో ఉన్న అన్నదాతకు అనంత్ అంబానీ భరోసా.. రైతు ఆనందం వీడియోలో..
ఆపదలో ఉన్న అన్నదాతకు అనంత్ అంబానీ భరోసా.. రైతు ఆనందం వీడియోలో..
NEET UG కౌన్సెలింగ్‌లో ఆ 37 మంది MBBS, BDS సీట్లు రద్దు!
NEET UG కౌన్సెలింగ్‌లో ఆ 37 మంది MBBS, BDS సీట్లు రద్దు!
23.20 సెకన్లలో ఫినిష్.. 200 మీటర్ల పరుగులో భారత్‌కు కాంస్యం..!
23.20 సెకన్లలో ఫినిష్.. 200 మీటర్ల పరుగులో భారత్‌కు కాంస్యం..!
బిగ్ బాస్ చరిత్రలోనే హయ్యేస్ట్ రెమ్యునరేషన్..
బిగ్ బాస్ చరిత్రలోనే హయ్యేస్ట్ రెమ్యునరేషన్..
కళ్లముందే రాయిలా మారే జీవి.. సముద్రపు మాయగాడు ఆక్టోపస్ రహస్యాలు..
కళ్లముందే రాయిలా మారే జీవి.. సముద్రపు మాయగాడు ఆక్టోపస్ రహస్యాలు..