Telugu News Trending Groom Did a Funny Act on Stage After Seeing Beauty of the Bride Telugu News
Viral Video: వధువు అందాన్ని చూసి ఆందోళనలో పడ్డ వరుడు..! ఎందరికళ్లు పడ్డాయో అంటూ ఏం చేశాడో తెలుసా..?
అక్కడ వేదికపై వధువు రెడ్ కలర్ లెహంగాలో చాలా అందంగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వధువు అందాన్ని చూసిన వరుడు ఆందోళనలో పడతాడు. ఆమె అందంపై ఎందరి కళ్లు పడ్డాయోనని భావించి.. వెంటనే తన చేతిలో ఉన్న నల్లటి దుప్పటతో ఏం చేశాడో చూస్తే మీరు కూడా ఆశ్చర్యంతో నోరెళ్ల బెట్టాల్సిందే..
పెళ్లికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లిలో జరిగే ఫన్నీ మూమెంట్స్, కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ జీవితాంతం గుర్తుండిపోతాయి. నెటిజన్లు ఈ వీడియోలను ఎక్కువగా ఇష్టపడటానికి కూడా ఇదే కారణం. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వీడియోపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముందుగా పెళ్లి సమయంలో వధూవరులు వేదికపై నిలబడి ఉండటం వైరల్ వీడియోలో చూడొచ్చు. వీరిద్దరి మెడలో వరమాల కనిపిస్తుంది. అంటే వరమాల వేడుక పూర్తైందని వీడియో చూడగానే తెలిసింది. ఇంతలో, వరుడు చేసిన పనికి అక్కడున్న వారందరూ షాక్ అవుతారు. అక్కడ వేదికపై వధువు రెడ్ కలర్ లెహంగాలో చాలా అందంగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వధువు అందాన్ని చూసిన వరుడు ఆందోళనలో పడతాడు. ఆమె అందంపై ఎందరి కళ్లు పడ్డాయోనని భావించి.. వెంటనే తన చేతిలో ఉన్న నల్లటి దుప్పటతో ఆమెకు దిష్టి తీయటం మొదలు పెట్టాడు. ఈ సీన్ అక్కడున్న వారందరినీ అవాక్కయ్యేలా చేసింది. వేదికపైనే వరుడు ఇలా చేయడం చూసి, వధువు ఒక్క క్షణం షాక్ అవుతుంది. కానీ, అతనిని ప్రేమతో తధేకంగా చూస్తూ ఉండిపోతుంది.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు విపరీతంగా స్పందించారు. వీడియో పోస్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 3 మిలియన్ల కంటే ఎక్కువగా వ్యూస్ వచ్చాయి. దీంతో పాటు ఈ వీడియోకు మూడు లక్షలకు పైగా లైక్స్ కూడా వచ్చాయి. ఈ వీడియోపై జనాలు కూడా ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక వినియోగదారు ‘వెరీ క్యూట్ మూమెంట్’ అని రాస్తే, మరొక వినియోగదారు ‘ఇదేం కొత్త జిమ్మిక్’ అంటూ రాశారు.