ప్రతి రోజూ పరగడుపున వీటిని తినడం అలవాటుచేసుకోండి..! రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరిగిపోతుంది
రక్త నాళాల నుండి కొలెస్ట్రాల్‌ను తొలగించడానికి ముఖ్యంగా ఆహారంపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. మంచి ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి రక్తనాళాల్లో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తం గడ్డకట్టే కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి ప్రతిరోజూ ఉదయం అల్పాహారంలో కొన్ని ఆహారాలను తప్పక తీసుకోవటం మంచిది.
రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ గుండెకు సంబంధించిన అనేక వ్యాధులకు దారితీస్తుంది. కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల శరీరమంతా రక్తప్రసరణ సక్రమంగా జరగదు. దీని వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయి. అంతే కాదు గుండెపోటు వంటి తీవ్రమైన వ్యాధులకు కూడా దారి తీస్తుంది. కానీ కొలెస్ట్రాల్‌ను సులభంగా నియంత్రించవచ్చు. ఈ పదార్థాలను ఆహారంలో తీసుకుంటే కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. రక్త నాళాల నుండి కొలెస్ట్రాల్‌ను తొలగించడానికి ముఖ్యంగా ఆహారంపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. మంచి ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి రక్తనాళాల్లో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తం గడ్డకట్టే కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి ప్రతిరోజూ ఉదయం అల్పాహారంలో కొన్ని ఆహారాలను తప్పక తీసుకోవటం మంచిది.
కొలెస్ట్రాల్ నియంత్రించే ఆహారం:
ఎండుద్రాక్ష:
ఎండుద్రాక్షలో ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, విటమిన్లు, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది. ఎండుద్రాక్షలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించే ఫైటోకెమికల్స్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి.
బాదం:
విటమిన్ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు బాదంపప్పులో ఉంటాయి. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఇది ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.
మెంతులు:
మెంతికూరలో ఔషధ గుణాలు ఉన్నాయి. మెంతులు తీసుకోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అలాగే, ఇది ట్రైగ్లిజరైడ్, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. దీని వల్ల శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఫోలిక్ యాసిడ్, రైబోఫ్లేవిన్, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు, ఇనుము, కాల్షియం, కాపర్, పొటాషియం వంటి ఖనిజాలు మెంతికూరలో ఉంటాయి.
పొద్దుతిరుగుడు విత్తనాలు :
పొద్దుతిరుగుడు గింజల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఆహారంలో సోయాబీన్‌కు బదులుగా సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను ఉపయోగించమని కొన్నిసార్లు సలహా ఇస్తారు. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.
అవిసె గింజలు :
అవిసె గింజలలో మంచి మొత్తంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మరియు యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…