Watch: వార్నీ.. మీరేక్కడ దొరికార్రా బాబు.. మెట్రోలో బ్రష్ చేస్తున్న ఘనుడు.. ఆఫీస్‌కు లేటైతే ఇలా చేస్తారా ?…
మెట్రోని పబ్లిక్ హౌస్‌గా ప్రకటించాలని కామెంట్లు కూడా మొదలయ్యాయి. తాజాగా అలాంటిదే మరొక విచిత్ర సంఘటనకు సంబంధించిన వీడియో తెరపైకి వచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. మీరెక్కడ దొరికర్రా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారు.
ఢిల్లీ మెట్రో గత కొన్ని రోజులుగా తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఢిల్లీ మెట్రోకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడమే ఇందుకు కారణం. ఈ వైరల్ వీడియో వెనుక కారణం ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న కొంతమంది ప్రయాణికుల వింత చేష్టలు. ఇది చూసిన తర్వాత అందరూ షాక్ అయ్యారు. బికినీ గర్ల్‌తో మొదలైన ఈ సిరీస్ ప్రయాణికుల మధ్య గొడవలు, జంట ముద్దుల కారణంగా చర్చల్లో నిలిచిపోయింది. ఢిల్లీ మెట్రో వైరల్ వీడియోలు నెటిజన్ల విమర్శలకు గురవుతుంది. ఢిల్లీ మెట్రోని పబ్లిక్ హౌస్‌గా ప్రకటించాలని కామెంట్లు కూడా మొదలయ్యాయి. తాజాగా అలాంటిదే మరొక విచిత్ర సంఘటనకు సంబంధించిన వీడియో తెరపైకి వచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. మీరెక్కడ దొరికర్రా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారు.
వైరల్ వీడియోలో ఢిల్లీ మెట్రోలో ఎక్కి ఒక యువకుడు చేతిలో బ్రష్ పట్టుకుని పళ్లు తోముకోవడం కనిపించింది. మెట్రోలో బ్రష్ చేస్తున్న యువకుడిని చూసి మెట్రోలో ఉన్న జనం ఉలిక్కిపడ్డారు. ఇదేంట్రా బాబు ఇలా చేస్తున్నావ్ అని అసహ్యం వ్యక్తం చేశారు. ఆ పక్కనే ఒక యువతి..వాడికి ఏం చెప్పాలో తెలియక తనలో తానే నవ్వుకుంటుంది. వీడేం వింత మనిషిరా దేవుడా..? అన్నట్టుగా ఆ అమ్మాయి స్పందన చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ దృశ్యాన్ని చూసి చుట్టుపక్కల వారు కూడా విరక్తితో నవ్వుకున్నారు. ఇదంతా వీడియోలో రికార్డ్ అయ్యింది. గ్రే కలర్ లోవ్రేలో ప్రయాణిస్తున్న ఈ యువకుడిని చూస్తుంటే తెల్లవారుజామున నిద్రలేచి అలాగే మెట్రోలో ఎక్కేసినట్టుగా అర్థమవుతుంది.
మెట్రోలో బ్రష్ చేస్తున్న యువకుడి వీడియో:
View this post on Instagram
వైరల్ వీడియో షేర్ చేసిన కొద్ది సమయంలోనే 1.3 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది. ఇది మాత్రమే కాదు, ఈ వీడియోకు ఇప్పటివరకు 81 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోపై వ్యాఖ్యానిస్తూ, ఒక వినియోగదారు ఇలా రాశారు.. ‘మీరు అనవసరమైన దృశ్యాలను సృష్టిస్తున్నారు’ అంటూ ఘాటుగా వ్యాఖ్యనించారు. ఎంత బిజీ అయితే మాత్రం ఇలా మెట్రోలో బ్రష్ చేయటం పట్ల పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..