ఓరీ దేవుడో..! హైవేపై ఆక్సిడెంట్‌.. ఒకదానికొకటి ఢీకొన్న 11 వాహనాలు.. షాకింగ్ వీడియో వైరల్

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఎంజీఎం కామోతీ ఆసుపత్రికి తరలించారు. లారీ, కంటైనర్ మధ్య ఇరుక్కుపోయిన కారును.. బయటకు తీసేందుకు క్రేన్‌ను తెప్పించారు. అక్కడి హైవేపై రద్దీ ఎక్కువగా ఉంది. ఒక SUV సెడాన్ కారుపైకి ఎక్కింది. దానిని మళ్లీ ట్రక్కు ఢీకొట్టింది.

ఓరీ దేవుడో..! హైవేపై ఆక్సిడెంట్‌.. ఒకదానికొకటి ఢీకొన్న 11 వాహనాలు.. షాకింగ్ వీడియో వైరల్
Road Accident
Follow us

|

Updated on: Apr 27, 2023 | 5:26 PM

మహారాష్ట్ర లోని రాయ్‌ఘడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ఒకటి కాదు రెండు కాదు వరుసగా 11 వాహనాలు ఒకదాని కొకటి ఢీకొట్టుకున్నాయి. ప్రమాదంలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో 4 నలుగురు గాయాలపాలైనట్టుగా తెలిసింది. జరిగిన ప్రమాదం కారణంగా ఎక్స్‌ప్రెస్‌వేపై చాలాసేపు ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ట్రక్కు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు ఓ అధికారి సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు బృందాలు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దీంతో ముంబై వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు కొంత సేపు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

వీడియో ఆధారంగా వీడియో ఆధారంగా..ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణిస్తున్న ఓకారు.. ముందున్న లారీని ఢీకొట్టింది. వెంటనే కంటైనర్ ఒకటి వెనుక నుంచి వచ్చి కారును ఢీకొట్టింది. రెండు భారీ వాహనాల మధ్య కారు నలిగిపోయింది. అదే సమయంలో మరో మూడు వాహనాలు అదుపుతప్పి ముందున్న వాహనాలను ఢీకొట్టాయి. నుజ్జునుజ్జైన కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఎంజీఎం కామోతీ ఆసుపత్రికి తరలించారు. లారీ, కంటైనర్ మధ్య ఇరుక్కుపోయిన కారును.. బయటకు తీసేందుకు క్రేన్‌ను తెప్పించారు. అక్కడి హైవేపై రద్దీ ఎక్కువగా ఉంది. ఒక SUV సెడాన్ కారుపైకి ఎక్కింది. దానిని మళ్లీ ట్రక్కు ఢీకొట్టింది.

ఇవి కూడా చదవండి

గతేడాది కూడా ఇదే ప్రాంతంలో ఇలాంటి ప్రమాదం జరిగి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది ఫిబ్రవరిలో భోర్ ఘాట్ వద్ద ట్రాఫిక్ జామ్ సమయంలో ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేపై వేగంగా వస్తున్న ట్రక్కు అదుపు తప్పి కారును వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించారు. పలువురు గాయపడ్డారు. కొన్ని రోజుల క్రితం పూణెలో ట్రక్కు, బస్సు మధ్య ఘోర ప్రమాదం జరిగింది.

మహారాష్ట్రలో నిత్యం రోడ్డు ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం, ముంబై-బెంగళూరు జాతీయ రహదారి సమీపంలో ట్రక్కు, బస్సు ఢీకొన్న ప్రమాదంలో 4 మంది మరణించారు. 22 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం ఏప్రిల్ 23, ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ముంబై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వే వద్ద ఒక దేవాలయం సమీపంలో జరిగింది. సతారా నుంచి థానేలోని డోంబివిలీకి వెళ్తున్న ప్రైవేట్ ప్యాసింజర్ బస్సు స్వామినారాయణ దేవాలయం సమీపంలోకి రాగానే వెనుక నుంచి వచ్చిన ట్రక్కు దానిని ఢీకొట్టిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు బస్సు ప్రయాణికులు, ట్రక్కు డ్రైవర్ మృతి చెందగా, 22 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ట్రక్కు డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం