Low cost Cars: కొత్త కారు కొంటున్నారా..? సేఫ్టీలో ఉత్తమ రేటింగ్ పొందిన బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు ఇవి.. ధర రూ.10 లక్షల కంటే తక్కువే
భారతీయ మార్కెట్లో ప్రస్తుతం ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ కలిగిన వాహనాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే తక్కువ ధర వద్ద లభించే కార్లలో కూడా సేఫ్టీ ఫీచర్స్ కావలసినన్ని అందుబాటులో ఉన్నాయి. రూ. 10 లక్షల లోపు ధరతో అత్యంత సురక్షితమైన బడ్జెట్ ఫ్రెండ్లీ కార్ల వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..
ప్రతి ఒక్కరూ చిన్న కారు అయినా సొంతంగా కొనుక్కోవాలని కోరుకుంటారు. కానీ, బడ్జెట్ కారణంగా చాలా మంది కారు కొనేందుకు వెనుకడుగు వేస్తుంటారు. దేశంలో, SUVలు, ప్రీమియం కార్లు కాకుండా, అనేక సరసమైన హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. దేశంలో అనేక SUVలు, ప్రీమియం కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రధాన భాగమైన సరసమైన హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లు ఎక్కువ ప్రజాదరణ పొందిన చిన్న బడ్జెట్‌కు అనుకూలమైన కార్లు. అయితే, ఇక్కడ మరోక ముఖ్యమైన విషయం ఎంటంటే.. కొందరు ధర ఎంత వున్నా ఆలోచించకుండా తమకు నచ్చిన వాహనాలను కొనేస్తూ ఉంటారు. అయితే వాహనం కొనే ముందు దాని డిజైన్, ఫీచర్స్, పర్ఫామెన్స్ మాత్రమే కాకుండా అది భద్రత పరంగా ఎంతవరకు ప్రయాణికులను రక్షించగలదు అనే విషయాలను కూడా తెలుసుకోవాలి. భారతీయ మార్కెట్లో ప్రస్తుతం ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ కలిగిన వాహనాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే తక్కువ ధర వద్ద లభించే కార్లలో కూడా సేఫ్టీ ఫీచర్స్ కావలసినన్ని అందుబాటులో ఉన్నాయి. రూ. 10 లక్షల లోపు ధరతో అత్యంత సురక్షితమైన బడ్జెట్ ఫ్రెండ్లీ కార్ల వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..
రూ. 10 లక్షలలోపు అందుబాటులో ఉండే బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు: * మారుతి సుజుకి ఆల్టో(Maruti Suzuki Alto):
భారతదేశంలో లభించే అత్యంత చౌకైన కారు మారుతి సుజుకి ఆల్టో. దీని ధర సుమారు రూ. 3.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
* మారుతి సుజుకి వ్యాగన్ఆర్(Maruti Suzuki WagonR):
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ధర 5.54 లక్షల రూపాయల నుండి ప్రారంభమవుతుంది.
* టాటా టియాగో (Tata Tiago) :
టాటా టియాగో ఎక్స్-షోరూమ్ ధర రూ.5.54 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
* హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్) (Hyundai Grand i10 Nios) :
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ధర 5.73 లక్షల రూపాయల నుండి ప్రారంభమవుతుంది.
* మారుతీ సుజుకి స్విఫ్ట్(Maruti Suzuki Swift):
భారత ఆటోమొబైల్ మార్కెట్లో తనదైన ముద్ర వేసిన మారుతీ సుజుకి స్విఫ్ట్ ప్రారంభ ధర రూ.5.99 లక్షల నుంచి.
* టాటా పంచ్: (Tata Punch):
ప్రముఖ టాటా పంచ్ కారు కూడా మారుతి సుజుకి స్విఫ్ట్ కారుతో సమానంగా ఎక్కువ లేదా తక్కువ ధరలో అందుబాటులో ఉంది.
* రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber):
రెనాల్ట్ ట్రైబర్ ధర రూ.6.33 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
* మారుతి సుజుకి డిజైర్(Maruti Suzuki Dzire) :
మారుతి సుజుకి డిజైర్ ప్రారంభ ధర రూ.6.51 లక్షల నుండి.
* మారుతి సుజుకి బాలెనో(Maruti Suzuki Baleno) :
మారుతి సుజుకి బాలెనో ఎక్స్-షోరూమ్ ధర రూ.6.61 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
* మహీంద్రా బొలెరో నియో(Mahindra Bolero Neo) :
మహీంద్రా బొలెరో నియో ఎక్స్-షోరూమ్ ధర రూ.9.63 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..