Amazon Prime: మారిన అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ధరలు.. ఎంతలా పెరిగాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ తన యూజర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. భారత్‌లో సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని అమెజాన్ తెలిపింది. ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి..
ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ తన యూజర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. భారత్‌లో సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని అమెజాన్ తెలిపింది. ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి 2024 జనవరి 15వ తేదీ వరకు పాత రేట్టే వర్తిస్తాయి. ఇక ప్రైమ్ నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ఏకంగా 67 శాతం మేర పెంచడం గమనార్హం.
పెరిగిన ధరలు ఎలా ఉన్నాయంటే..
అమెజాన్ ప్రైబ్ నెల ప్యాకేజీ పాత ధర రూ. 179గా ఉండగా దీనిని తాజాగా ఏకంగా రూ. 299కి పెంచుతున్నారు. అలాగే మూడు నెలల ప్యాక్ పాత ధర రూ. 459 కాగా, కొత్తగా పెరిగిన ధరతో రూ. 599కి చేరింది. అయితే ఏడాది ప్లాన్ ధరలో ఎలాంటి మార్పు లేదని అమెజాన్ తెలిపింది. ప్రస్తుతం ఉన్న రూ. 1499నే కొనసాగించనున్నారు. ఇదిలా ఉంటే అమెజాన్ ప్లాన్ ధరలను పెంచడం ఇదే తొలిసారి కాదు. 2021లో నెలవారీ ప్యాకేజ్ ధర రూ. 120గా ఉండగా దానిని రూ. 179కి పెంచింది.
ఇదిలా ఉంటే అమెజాన్ ప్రైమ్ సేవలను భారత్‌లో 2016లో తీసుకొచ్చింది. అమెజాన్ ప్రైమ్ తీసుకున్న వారికి ముందుగా వస్తువులు డెలివరీ చేయడం, ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్, ప్రైమ్ డీల్స్, ప్రైమ్ రీడింగ్, ప్రైమ్ గేమింగ్, అమెజాన్ ఫ్యామిలీ వంటి అదనపు సదుపాయాలను అందిస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..