Whatsapp Update: వాట్సాప్‌లో అదిరిపోయే అప్‌డేట్.. అడ్మిన్ల కోసమే ప్రత్యేకం

క్రమేపి వాట్సాప్‌లో గ్రూపుల హవా పెరిగింది. ముఖ్యంగా ఫేక్ వార్తల వ్యాప్తికి వాట్సాప్ గ్రూపులే కారణం అవతున్నాయి. ఒక్కోసారి ఇలాంటి వార్తల వల్ల వాట్సాప్ అడ్మిన్లు కేసుల్లో ఇరుక్కున్న ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు యూజర్ల రక్షణకు వాట్సాప్ వివిధ అప్‌డేట్స్ ఇస్తూ ఉంటుంది. ప్రస్తుతం వాట్సాప్ గ్రూపుల్లో అడ్మిన్ల కోసం ఓ కొత్త అప్‌డేట్ ఇచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Whatsapp Update: వాట్సాప్‌లో అదిరిపోయే అప్‌డేట్.. అడ్మిన్ల కోసమే ప్రత్యేకం
Whatsapp
Follow us
Srinu

|

Updated on: Apr 27, 2023 | 4:30 PM

ప్రస్తుతం యువత ఎక్కువగా వాడుతున్న స్మార్ట్‌ఫోన్లల్లో వాట్సాప్‌ను అధికంగా వినియోగిస్తున్నారు. ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ద్వారా ఫొటోలు, వీడియోలు, డాక్యూమెంట్లు వంటి షేర్ చేసే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది దీన్ని వినియోగిస్తున్నారు. అలాగే వాట్సాప్ గ్రూపుల ద్వారా ఒకేసారి ఎక్కువ మందితో చాట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అయితే క్రమేపి వాట్సాప్‌లో గ్రూపుల హవా పెరిగింది. ముఖ్యంగా ఫేక్ వార్తల వ్యాప్తికి వాట్సాప్ గ్రూపులే కారణం అవతున్నాయి. ఒక్కోసారి ఇలాంటి వార్తల వల్ల వాట్సాప్ అడ్మిన్లు కేసుల్లో ఇరుక్కున్న ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు యూజర్ల రక్షణకు వాట్సాప్ వివిధ అప్‌డేట్స్ ఇస్తూ ఉంటుంది. ప్రస్తుతం వాట్సాప్ గ్రూపుల్లో అడ్మిన్ల కోసం ఓ కొత్త అప్‌డేట్ ఇచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గ్రూపు సభ్యులు గ్రూప్ ఇన్‌వైట్ లింక్ ద్వారా చేరినప్పటికీ గ్రూపులో ప్రవేశించే ముందు గ్రూప్ అడ్మిన్ ఆమోదించాల్సి ఉంటుంది. అయితే ఈ దశలను చేయాలంటే కచ్చితంగా గ్రూపు అడ్మిన్ ఫీచర్‌ను ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఫీచర్ డిసేబుల్‌లో ఉంటే మాత్రం గతంలోలాగానే అడ్మిన్ ఆమోదం లేకుండానే గ్రూపులో చేరిపోతారు. కమ్యూనిటీ ఎడ్మిన్‌ను సబ్ గ్రూప్‌కు ఆహ్వానించమని కోరతూ స్పామ్ ఎంట్రీలు, స్పామ్ మెసేజ్‌లను తగ్గించాలని కంపెనీ కోరుకుంటుంది. అందువల్లే ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది,

ప్రస్తుతం వాట్సాప్‌లో ఈ ఫీచర్ పరీక్షల దశలో ఉంది. భవిష్యత్‌లో ఇది వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే పలువరు వినియోగదారులకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిందని నిపుణులు పేర్కొంటున్నారు. భవిష్యత్‌లో అందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకువస్తారని అంచనా వేస్తున్నాయి. అలాగే వాట్సాప్ ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ వంటి ఫీచర్లను అందించడానికి కూడా ప్రయత్నిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ మేసేజ్‌లను విస్తృత శ్రేణి వ్యక్తులకు పంపడానికి సాయం చేస్తుంది. అదనంగా యూజర్లు ప్రసార సందేశాల రూపంలో తాజా అప్‌డేట్‌ను పొందుతారు. ఈ ఫీచర్ కూడా ప్రస్తుతం పరీక్షల దశలో ఉంది. భవిష్యత్‌లో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..