AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Whatsapp for Windows : విండోస్ కోసం సరికొత్త వాట్సాప్ అప్లికేషన్.. ఇక ఆ సమస్యలకు సెలవు..

వాట్సాప్ డెస్క్‌టాప్ వెర్షన్‌కు కూడా ఆదరణ పెరిగింది. దీంతో ప్రస్తుతం వాట్పాప్‌ను సొంతం చేసుకున్న మెటా వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ త్వరలో వాట్సాప్‌లో విండోస్ అప్లికేషన్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

New Whatsapp for Windows : విండోస్ కోసం సరికొత్త వాట్సాప్ అప్లికేషన్.. ఇక ఆ సమస్యలకు సెలవు..
Whatsapp
Nikhil
|

Updated on: Mar 25, 2023 | 5:30 PM

Share

ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఆయా ఫోన్స్‌లో వచ్చే యాప్స్ ద్వారా మన అవసరాలను చాలా సులభంగా తీరిపోతున్నాయి. ముఖ్యంగా ఇలా అందరి ఆదరణ పొందిన వాట్సాప్‌లో వివిధ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్‌ను ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ అంటారు. కేవలం మెసెజ్‌లు మాత్రమే కాకుండా వీడియో కాల్స్, ఆడియో కాల్స్ కూడా ఈ యాప్ ద్వారా చేసుకునే వెసులుబాటు ఉంది. దీంతో ఎక్కువ మంది వాట్సాప్ వినియోగానికి మక్కువ చూపుతున్నారు. అయితే ఇంతటి ఆదరణ పొందిన యాప్‌లో వివిధ కంపెనీలు కూడా గ్రూప్స్ పెట్టుకుని ఉద్యోగులకు దిశానిర్ధేశం చేస్తున్నాయి. దీంతో వాట్సాప్ డెస్క్‌టాప్ వెర్షన్‌కు కూడా ఆదరణ పెరిగింది. దీంతో ప్రస్తుతం వాట్పాప్‌ను సొంతం చేసుకున్న మెటా వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ త్వరలో వాట్సాప్‌లో విండోస్ అప్లికేషన్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ వాట్సాప్ విండోస్ అప్లికేషన్‌లో వచ్చే ఫీచర్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

ఈ విండోస్ వాట్సాప్ యాప్‌లో గరిష్టంగా 8 మంది వ్యక్తులతో గ్రూప్ వీడియో కాల్‌లను, గరిష్టంగా 32 మంది వ్యక్తులతో ఆడియో కాల్‌లను ఎనేబుల్ చేస్తుంది. అన్నీ డెస్క్‌టాప్ అప్లికేషన్‌ల నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుందని జుకర్ బర్గ్ ప్రకటించారు. కొత్త విండోస్ డెస్క్‌టాప్ యాప్ వేగంగా లోడ్ అవుతుందని, వాట్సాప్, విండోస్ వినియోగదారులకు తెలిసిన ఇంటర్‌ఫేస్‌తో రూపొందించబడిందని వాట్సాప్ పేర్కొంది. కాలక్రమేణా ఈ పరిమితులకు భవిష్యత్తులో మరిన్ని అప్‌డేట్స్ వస్తాయని వివరించింది. వేగంగా వాట్సాప్ లింక్ చేయడంతో పాటు మెరుగైన సమకాలీకరణ, అలాగే లింక్ ప్రివ్యూలు, స్టిక్కర్‌ల వంటి కొత్త ఫీచర్‌లను అందిస్తుంది. 

ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ల కోసం బీటా వెర్షన్

వాట్సాప్ మరిన్ని పరికరాల్లో మద్దతును క్రమంగా పెంచుతోంది. ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ల కోసం కంపెనీ ఇప్పుడే కొత్త వాట్సాప్ బీటా అనుభవాన్ని పరిచయం చేసింది. ప్రస్తుతం బీటా ప్రారంభ దశలో ఉన్న మ్యాక్ డెస్క్‌టాప్‌ల కోసం వారు కొత్త, వేగవంతమైన యాప్‌ను అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..