5 నిమిషాల్లోనే ఫోన్ ఫుల్ చార్జింగ్.. 300 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ అభివృద్ధి

ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణం కూడా గడవని పరిస్థితి. ఎన్నో ఇంపార్టెంట్‌ వ్యవహారాలు సైతం ఫోన్‌ ద్వారానే నిర్వహిస్తుంటారు చాలామంది.

5 నిమిషాల్లోనే ఫోన్ ఫుల్ చార్జింగ్.. 300 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ అభివృద్ధి

|

Updated on: Mar 25, 2023 | 10:01 AM

ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణం కూడా గడవని పరిస్థితి. ఎన్నో ఇంపార్టెంట్‌ వ్యవహారాలు సైతం ఫోన్‌ ద్వారానే నిర్వహిస్తుంటారు చాలామంది. ఈ క్రమంలో ఫోన్‌ ఛార్జింగ్‌ ఆయిపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే కొందరు చార్జింగ్ పెట్టి మరీ పనులు చూసుకుంటూ ఉంటారు. ఈ ఇబ్బందులకు చెక్‌ పెట్టేందుకు రెడీ అయింది రెడ్ మీ. కేవలం ఐదు నిమిషాల్లోనే ఫోన్ చార్జింగ్ పూర్తయ్యే 300 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని రెడ్ మీ ఆవిష్కరించింది. ఇది 4,100 ఎంఏహెచ్ బ్యాటరీని 5 నిమిషాల్లో చార్జ్ చేసేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో చైనీస్ సోషల్ మీడియా యాప్ వీబోలో కనిపించింది. రెడ్ నోట్ 12 డిస్కవరీ ఎడిషన్ స్మార్ట్ ఫోన్, 4,100 ఎంఏహెచ్ బ్యాటరీని 300 వాట్ చార్జర్ తో చార్జింగ్ చేసి చూసింది. ఇది కేవలం 3 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్ ను పూర్తి చేసింది. చైనాకు చెందిన రియల్ మీ సైతం ఇటీవలే 240 వాట్ ఫాస్ట్ చార్జర్ టెక్నాలజీని ఆవిష్కిరించింది. ఈ చార్జర్ తో 4,600 ఎంఏహెచ్ బ్యాటరీని కేవలం 9 నిమిషాల్లోనే చార్జ్ చేసుకోవచ్చు. త్వరలోనే ఈ ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం మనకు కూడా అందుబాటులోకి రానుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పిల్లాడే కదా అని ఆస్తి కొట్టేశారు.. తిరిగి ఎలా దక్కించుకున్నాడంటే ??

విమర్శకులు తలదించుకునేలా.. తారక్ సమాధనం !!

Oscar: ఆస్కార్ అవార్డు అమ్మితే ఎంతొస్తుందో తెలుసా ??

Naresh-Pavithra Lokesh: తేలిపోయింది !! ఇదంతా ఉత్తుత్తి ముచ్చటే !!

మౌనమునా మజాకా.. తమ్మరెడ్డికి దిమ్మతిరిగేలా కౌంటర్..

 

Follow us