Poco f5: భారత మార్కెట్లోకి పోకో నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. తక్కువ ధరలోనే స్టన్నింగ్ ఫీచర్స్‌

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం పోకో తాజాగా మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. పోకో ఎఫ్‌5 పేరుతో లాంచ్‌ చేసిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ను బడ్జెట్‌ ధరలో తీసుకొచ్చారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఉన్న ఫీచర్లు ఏంటంటే..

Narender Vaitla

|

Updated on: Apr 26, 2023 | 7:39 PM

 చైనాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం పోకో భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. పోక్‌ ఎఫ్‌5 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ సేల్స్‌ మే9వ తేదీ నుంచి సేల్స్‌ ప్రారంభంకానుంది.

1 / 5
 భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ స్మార్ట్ ఫోన్‌ ఇప్పటికే లాంచ్‌ అయ్యింది. ఇక ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 7+ జెన్‌ 2 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది.

2 / 5
ఈ స్మార్ట్ ఫోన్‌ను 8 జీబీ, 12 జీబీ ర్యామ్‌తో పాటు 256 స్టోరేజ్‌ వేరియంట్‌లో లాంచ్‌ చేశారు. ధర విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌ బేస్‌ ధర రూ. 29,000 గా ఉంది.

3 / 5
ఇక ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు.  ఫోన్ 67W చార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఇందులో 64MP+ 8MP+ 2MP ట్రిపుల్ రియర్ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

5 / 5
Follow us