- Telugu News Photo Gallery Technology photos Vivo launching two smart phones vivo x90 and vivo x90 pro features and price details
Vivo X90: వివో నుంచి రెండు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. స్టన్నింగ్ లుక్, సూపర్ ఫీచర్స్.
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో తాజాగా రెండు కొత్త ఫోన్‌లను లాంచ్ చేసింది. వివో ఎక్స్90, ఎక్స్90 ప్రొ పేర్లతో తీసుకొచ్చిన ఈ ఫోన్ చైనా, మలేషియాలో అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే భారత్‌లో రానుంది..
Updated on: Apr 27, 2023 | 6:52 PM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో తాజాగా రెండు స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేసింది. వివో ఎక్స్ 90, వివో ఎక్స్ 90 ప్రో పేర్లతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్స్‌లో అదిరిపోయే ఫీచర్లను అందించారు.

ధర విషయానికొస్తే.. వివో ఎక్స్ 90 ప్రొ 12 జీబీ ర్యామ్, 1256 జీబీ స్టోరేజ్ ధర రూ. 84,999కాగా.. వివో ఎక్స్ 90 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ 59,999గా ఉంది. అలాగే 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 63,999.

ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లలో 6.79 ఇంచెస్ అమోఎల్‌ఈడీ 3డీ కర్వ్డ్ డిస్‌ప్లేను అందించారు. 1,260x 2,800 పిక్సెల్స్ రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం.

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ ఫోన్‌లలో ఆక్టా-కోర్ 4nm MediaTek డైమెన్సిటీ 9200 SoC ప్రాసెసర్‌ను అందించారు. 50వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4870 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.

కెమెరా విషయానికొస్తే.. ఇందులో 50+50+12 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో పాటు సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.




