Vitamin E: అందం కోసం అతిగా విటమిన్-E క్యాప్సుల్‌లోని ఆయిల్ వాడుతున్నారా..? తీవ్రత దారుణంగా ఉంటుంది..!
ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసి, ఈ పేస్ట్‌ని మీ ముఖం, మెడ అంతటా అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఈ విధంగా పాటిస్తే ఎలాంటి హాని లేకుండా మీ ముఖం మెరిసిపోతుంది.
చాలా మంది అందంగా మెరిసిపోవాలని ఏవేవో రాస్తుంటారు. అయితే విటమిన్ ఇ ఆయిల్ రాయడం వల్ల బ్యూటీ ప్రొడక్ట్స్‌ని రాసినా రాని అందం మీ సొంతం అవుతుంది. విటమిన్ ఇ ఆయిల్ స్కిన్, హెయిర్‌కి ఎంతో మంచిది. దీని వల్ల ఎన్నో బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయి. విటమిన్ ఇ టాబ్లెట్లను ఫేస్ ప్యాక్‌లో వేసుకునే మహిళలు విటమిన్ ఈ ఆయిల్ అతిగా వాడితే కలిగే అనర్ధాలను కూడా తెలుసుకోవటం చాలా ముఖ్యం. లేదంటే, దాంతో మొదటికే మోసం వస్తుంది.
మహిళలు ముఖ సౌందర్యాన్ని పెంచుకోవటం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖానికి చాలా క్రీములు, పౌడర్లు వేసుకుంటారు. విటమిన్ ఇ క్యాప్సుల్స్ కూడా వాడుతుంటారు. ఈ ట్యాబ్లెట్ నుంచి నూనె తీసి ముఖానికి రాసుకుంటే ముఖం త్వరగా కాంతివంతంగా మారుతుంది. కానీ, అతిగా వాడితే అది మీ ముఖాన్ని పాడు చేస్తుంది. విటమిన్ ఇ మాత్రలలో ఉండే నూనెను తరచుగా వాడటం వల్ల చర్మంపై దద్దుర్లు, దురదలు వంటి సమస్యలు వస్తాయి. చర్మానికి విటమిన్ ఇ అప్లై చేయడం వల్ల అలెర్జీ ప్రతిచర్యలు సంభవించవచ్చు. చాలా మందిలో చర్మవ్యాధిని కలిగించవచ్చు. ఇది మీ ముఖం అధిక వాపు, కంటి చికాకు, అల్సర్లు లేదా పుండ్లకు సంబంధించిన సమస్యలకు దారి తీస్తుంది. విటమిన్ ఇ మాత్రలు వాడడం వల్ల ముఖం మొదట్లో స్పష్టంగా కనిపిస్తుంది. చర్మంపై దద్దుర్లు కాలక్రమేణా అభివృద్ధి చెందుతాయి. కొంతమందికి స్కిన్ పిగ్మెంటేషన్ సమస్యలు ఉండవచ్చు. ఇది చర్మ సున్నితత్వాన్ని కూడా కలిగిస్తుంది.
విటమిన్ ఇ ఆయిల్, అలోవెరా జెల్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. దీని కోసం మీరు టాబ్లెట్ నుండి నూనెను తీసి అందులో అలోవెరా జెల్ వేయాలి. ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసి, ఈ పేస్ట్‌ని మీ ముఖం, మెడ అంతటా అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఈ విధంగా పాటిస్తే ఎలాంటి హాని లేకుండా మీ ముఖం మెరిసిపోతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..