వామ్మో.. పంటి సెట్ విలువ అక్షరాల రూ. 40 లక్షలు.. అంతలా ఏముంటుంది అనుకుంటున్నారా?
వివిధ రకాల పళ్లకు డిమాండ్ వస్తుందని జ్యువెలర్స్ యజమానులు చెబుతున్నారు. కొందరికి గుండె ఆకారంలో ఉండే దంతాలు కావాలి, మరికొందరికి తుపాకీ ఆకారంలో ఉండేవి కావాలంటూ ఆర్డర్లు ఇస్తున్నారని చెబుతున్నారు.
ఆభరణాలతో పాటు, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ (LGDలు) స్మార్ట్‌ఫోన్‌లు, వాచీలు, గ్లాసెస్, బెల్ట్‌లు, డెకరేటివ్ లాక్‌లతో సహా ఖరీదైన ఉపకరణాలలో పొదిగి తయారు చేయించుకోవటం ట్రెండ్‌గా మారింది. ఇది అమెరికా వంటి సంపన్న దేశాల్లోనే కాదు.. మన భారతదేశంలోని అత్యంత సంపన్న వర్గాల్లోనూ ఇలాంటి ట్రెండ్ పెరుగుతోంది. ఈక్రమంలోనే బంగారు, వెండి, వజ్రాల పెట్టుడు దంతాలు అందుబాటులోకి వచ్చాయి.
సూరత్ భారతదేశంలోని రత్నాల పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన నగరం. రత్నాలు, బంగారాన్ని ఉపయోగించి సూరత్‌లో తయారు చేసే ఆభరణాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. విదేశాల్లో కూడా వీటికి గిరాకీ ఎక్కువ. ఇప్పుడు సూరత్ రత్నాలతో చేసిన పంటి కారణంగా మరోమారు వార్తల్లో నిలిచింది. దీంతో పాటు బంగారం, వెండి పళ్లు కూడా ఇక్కడి నుంచి మార్కెట్ అవుతున్నాయి.
సూరత్‌లో తయారయ్యే రత్నాల పళ్ల ధర 25 లక్షల నుంచి 40 లక్షలు. వారు 16 దంతాల సమితిని తయారు చేశారు. పై పంటి వరుస, దిగువన ఎనిమిది పళ్ళు ఉన్నాయి. దంతాల సెట్ 2000 వజ్రాలతో తయారు చేశారు.
వివిధ రకాల పళ్లకు డిమాండ్ వస్తుందని జ్యువెలర్స్ యజమానులు చెబుతున్నారు. కొందరికి గుండె ఆకారంలో ఉండే దంతాలు కావాలి, మరికొందరికి తుపాకీ ఆకారంలో ఉండేవి కావాలంటూ ఆర్డర్లు ఇస్తున్నారని చెబుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..