Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: టీవీ ముందు కూర్చుని ఎవరైనా వర్క్ చేస్తారు.. థియేటర్‌లో చేసేవారికే ఓ రేంజ్ ఉంటది.. నువ్వు తోపు గురూ

ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు.. ఆ వీడియోలో ఓ వ్యక్తి సినిమా థియేటర్‌లో సినిమా చూస్తూ ల్యాప్‌టాప్‌లో పని చేస్తూ కనిపించాడు. వైరల్ వీడియోను ఇప్పటివరకు 6 లక్షలకు పైగా వీక్షించారు. ఇంకా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది..

Watch: టీవీ ముందు కూర్చుని ఎవరైనా వర్క్ చేస్తారు.. థియేటర్‌లో చేసేవారికే ఓ రేంజ్ ఉంటది.. నువ్వు తోపు గురూ
Man Works On Laptop In Movi
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 26, 2023 | 10:05 PM

కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీని దుష్ప్రభావాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి.. మహమ్మారికి ముందు ఇంటి నుండి పని చేయడం అనేది ఆచారం. కానీ, మహమ్మారి సమయంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులను కార్యాలయానికి పిలవడానికి బదులుగా ఇంటి నుండి పని చేయడానికి అనుమతించాయి. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ట్రెండ్ నడుస్తోంది. ఇంటి నుండి పని చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. దానిలో ప్రతికూలతలు కూడా ఉన్నాయి. చాలా మంది తమ ఇతర పనులను కూడా( వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ టైమ్‌)ఆఫీస్‌ వర్క్‌ టైమ్‌లోనే పూర్తి చేసుకుంటున్నారు. కొంతమంది సెలవుల్లో కూడా ల్యాప్‌టాప్‌లో పని చేయాల్సి ఉంటుంది. అలాగే, ఇక్కడ ఓ వ్యక్తి సినిమా థియేటర్‌లో సినిమా చూస్తూ తన ల్యాప్‌టాప్‌లో పని చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. వీడియో బెంగళూరుకు చెందినట్టుగా తెలిసింది.

ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు.. ఆ వీడియోలో ఓ వ్యక్తి సినిమా థియేటర్‌లో సినిమా చూస్తూ ల్యాప్‌టాప్‌లో పని చేస్తూ కనిపించాడు. వైరల్ వీడియోను ఇప్పటివరకు 6 లక్షలకు పైగా వీక్షించారు. ఇంకా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది.. ఈ వైరల్ వీడియో బెంగుళూరులోని ఓ థియేటర్‌కి సంబంధించినది. వీడియోలో థియేటర్ లోపల తన సీటుపై కూర్చుని ఒక వ్యక్తి తన ల్యాప్‌టాప్‌లో పనిచేస్తున్నట్లు మీరు చూడవచ్చు. వీడియో ఆదారంగా సినిమా ఇంకా స్టార్ట్‌ కాలేదని తెలుస్తోంది. అయితే థియేటర్‌లో ల్యాప్‌టాప్ తెరిచి చూడడం మాత్రం నిజంగా అందరికీ ఆశ్చర్యపోయే అంశమే.. ఒకింత షాకింగ్ సంఘటన కూడాను.

ఇవి కూడా చదవండి

సినిమా చూడటానికి అదే థియేటర్‌లో ఉన్న మిగతా ప్రేక్షకులు ఈ వ్యక్తి తన ల్యాప్‌టాప్‌తో థియేటర్ లోపల కూర్చున్న క్షణాన్ని రికార్డ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగుళూరు మలయాళీలు అనే ఇన్‌స్టాగ్రామ్ ID నుండి ఈ ఆసక్తికరమైన వీడియో ఏప్రిల్ 10 న షేర్‌ చేయబడింది. ఈ వీడియోకి ఇప్పటివరకు 6 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. బెంగుళూరులో టెక్కీ జీవితం అంటూ వీడియోతో పాటు క్యాప్షన్ కూడా ఇచ్చారు… ఈ వీడియో చూసిన సోషల్ మీడియా యూజర్లు కూడా క్యాప్షన్‌కు సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..