Mango: మామిడి పండ్లను కొంటున్నారా.. అయితే అవి పుల్లనివా.. తీపివా అని ఇలా తెలుసుకోండి..
బంగినపల్లి, తోతాపురి, నీలం, సువర్ణరేఖ, పెద్దరసాలు, చిన్నరసాలు ఇలా రకరకాల మామిడి పళ్లు లభిస్తాయి. పుల్లటి కాయలను ఊరగాయలు పెట్టుకుంటారు. తియ్యటి పళ్లను పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. మామిడి తీగయా ఉందా... పుల్లగా ఉందో ఇలా తెలుసుకోచ్చు..
మామిడికి నాలుగు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది భారతదేశపు జాతీయ ఫలం. చూడగానే నోరూరించే మామిడిపండ్ల మాధుర్యమే వేరు. సమ్మర్ సీజన్ మామిడి పళ్లకు ఫేమస్. ఇది యూనివర్సల్ ట్రూత్. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అంతా ఇష్టపడతారు. ఈ మూడు నెలలు ఫుల్ మాజా చేస్తారు జనం. మామిడిలో ఎన్నోరకాలున్నాయి. బంగినపల్లి, తోతాపురి, నీలం, సువర్ణరేఖ, పెద్దరసాలు, చిన్నరసాలు ఇలా రకరకాల మామిడి పళ్లు లభిస్తాయి. పుల్లటి కాయలను ఊరగాయలు పెట్టుకుంటారు. తియ్యటి పళ్లను పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. మామిడి కాయలను కోసి వాటిమీద కారం, ఉప్పు చల్లుకుని తింటే ఆ మజానే వేరుగా వుంటుంది. కొంతమంది పెరుగన్నంలో మామిడి పండు రసం కలుపుకుని తింటూ ఎంజాయ్ చేస్తారు. మామిడికి నాలుగు వేల ఏళ్ల చరిత్ర వుంది. ఇది భారతదేశపు జాతీయఫలం. వీటిని తింటే శరీరానికి కెరోటిన్, విటమిన్ సి, కాల్షయం పుష్కలంగా లభిస్తాయి.
ఎండవేడిమి మధ్య మామిడికాయల తీపి శరీరమంతా శక్తిని నింపుతుంది. వేసవిని మామిడి పళ్ల సీజన్ అని కూడా అంటారు. మామిడి పండ్లను తినడానికి ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. కానీ మామిడి పండ్లను కొనేటపుడు మనందరం ఒక విషయం గురించి తికమక పడతాం. నిజానికి మామిడి పండ్లను కొనేటపుడు మామిడికాయలు పుల్లగా ఉన్నా, తియ్యగా ఉన్నాయా.. అని తరచుగా పొరపాటు చేస్తుంటారు. ఈ పొరపాటు పిల్లలే కాదు వృద్ధులు కూడా చేస్తారు. మీరు తీపి మామిడిని ఎలా గుర్తించాలో ఇక్కడ మనం తెలుసుకుందాం..
మామిడికాయ పుల్లని లేదా తీపి అని ఎలా తెలుసుకోవాలి
మామిడి పైభాగం, చివరన, మధ్యన చూడండి. మామిడికాయను కొనే ముందు దాని పైభాగాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. దాని కొమ్మను.. అంటే మామిడి తొడిమే ప్రాంతంను సరిగ్గా చూడండి. మామిడి తొడిమే కొంత లోతుగా ఉన్నా.. ఆ మామిడి పండిన, తియ్యగా ఉంటుంది.
మామిడికింద చూడండి
ఒక మామిడిపండు తీసుకుని దాని అడుగున చూడండి. మామిడి కింది భాగంలో నలుపు లేదా ముదురు రంగు లేదా పొడి చర్మం కనిపించినట్లయితే.. అది తాజాగా పండిన మామిడి కాదని స్పష్టంగా అర్థం. అందంగా కనిపించవచ్చు కానీ తినడానికి తియ్యగా ఉండదు.
మామిడిపండు వాసన చూడండి
మామిడి పండ్లను కొనడానికి బయటకు వెళ్లినప్పుడల్లా మామిడికాయలు పక్వానికి వచ్చాయా లేదా అని వాటిని ముట్టుకుని వాసన చూసి తెలుసుకోవచ్చు. మామిడికాయను నొక్కుతూ చూస్తూంటే అది గట్టిగాలేకపోతే అది తియ్యగా ఉంటుంది. ఎందుకంటే మామిడి పండిన తర్వాత దాని రుచి మారిపోతుంది. తీపి మామిడి వాసన చాలా బాగుంటుంది. మామిడి పండును తీసుకుని దాని తొడిమే ప్రాంతంలో ముక్కుతో వాసన చూడండి.. తీయటి మామిడి అయితే.. ఆ వాసన మధురంగా ఉంటుంది. ఇలా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. భాగా పండిన, పాడైపోయిన మామిడికాయల నుంచి దుర్వాసన వస్తుంది. వాసన చూసిన తర్వాత అది తాజాది కాదని.. పూర్తిగా చెడిపోయిందని సులభంగా తెలుసుకోవచ్చు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం