- Telugu News Photo Gallery Follow these 5 natural and effective ways to keep your home free of termites, check to know full details
Termites: చెదపురుగులు ఇబ్బంది పెడుతున్నాయా..? సులభంగా తరిమికొట్టేయండిలా..
కాలంతో పనిలేకుండా ఇంట్లోని చెక్క వస్తువులను నాశనం చేస్తుంటాయి చెదపురుగులు. ముఖ్యంగా వేసవి కాలంలో ప్రధానంగా వేధిస్తుంటాయి. ఇక వీటి బెడద నుంచి బయట పడేందుకు అనేక రకాల స్ప్రేలు, టెక్నీక్స్ వాడుతుంటారు. అయితే అవేమి అవసరం లేకుండా ఇంట్లోని వస్తువలను ఉపయోగించి చెద పరుగుల బారి నుంచి ఎలా బయట పడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Apr 28, 2023 | 9:18 AM

సిట్రస్ పండ్లు: నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్ల వాసన చీమలు, చెదపురుగులను నివారిస్తుంది. ఈ పండ్ల రసాన్ని పిండి, నీటిలో కలిపి చెదపురుగులపై లేదా చెదలపై పిచికారీ చేయాలి.

నూనె: పిప్పరమింట, లావెండర్, టీ ట్రీ ఆయిల్ వంటి కొన్ని రకాల నూనెలు సహజ క్రిమి వికర్షకాలుగా పనిచేస్తాయి. డిఫ్యూజర్ లేదా స్ప్రే బాటిల్‌లో కొన్ని చుక్కలను నీటితో కలిపి తలుపులు, కిటికీలు మరియు ఇతర ప్రాంతాల చుట్టూ స్ప్రే చేయండి. తద్వారా చెదపురుగులు తొలగిపోతాయి.

వెనిగర్: వెనిగర్ నీటిలో కలిపి సహజ స్ప్రేగా ఉపయోగించవచ్చు. వెనిగర్ నుంచి వచ్చే బలమైన వాసన కీటకాలను తిప్పికొడుతుంది.

వెల్లుల్లి: వెల్లుల్లి వాసన కూడా చెదపురుగులు, దోమలు, చీమలు, బొద్దింకలు వంటి పలు క్రీమికీటకాలను తిప్పికొడుతుంది. అందుకోసం కొన్ని వెల్లుల్లి, లవంగాలను చూర్ణం చేసి, నీటిలో కలపండి. ఆపై చెదపురుగులపై ఇతర కీటాలపై స్ప్రే చేయండి.

పైన పేర్కొన్న విషయాలు ప్రాథమిక సమాచారం ఆధారంగా అందించడం జరిగింది. దీనినే ప్రమాణికంగా భావించి ఒక నిర్ణయానికి రావాలని సూచిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా ముందుగా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.





























