Electric Cycle: సైకిల్‌ని ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చిన సిద్ధిపేట్ వాసి.. కేవలం రూ. 16వేల ఖర్చుతోనే..
ఓ చిన్న పచారి సరుకుల వ్యాపారి ఏకంగా ఓ ఎలక్ట్రిక్ బైక్ నే తయారు చేశాడంటే నమ్మగలరా? అతని అవసరమే అన్ని ఆవిష్కర్తగా మార్చింది. తన ఆర్థిక పరిస్థితుల్లో కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను కొనుగోలు చేయలేక తన పాత సైకిల్ నే చిన్న బ్యాటరీ, మోటార్ సాయంతో ఎలక్ట్రిక్ బైక్ మార్చేశాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు మన తెలుగు వాడే. తెలంగాణ వాసే.
అవసరం.. మనిషిని ఆవిష్కర్తగా మారుస్తుంది. అవసరాలే తర్వాత కాలంలో మనిషిని కొత్తగా ఆలోచించేలా ప్రోత్సహిస్తాయి. తద్వారా కొత్త ఆవిష్కరణలు ప్రపంచం తలుపుతడతాయి. ఓ చిన్న పచారి సరుకుల వ్యాపారి ఏకంగా ఓ ఎలక్ట్రిక్ బైక్ నే తయారు చేశాడంటే నమ్మగలరా? అతని అవసరమే అన్ని ఆవిష్కర్తగా మార్చింది. తన ఆర్థిక పరిస్థితుల్లో కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను కొనుగోలు చేయలేక తన పాత సైకిల్ నే చిన్న బ్యాటరీ, మోటార్ సాయంతో ఎలక్ట్రిక్ బైక్ మార్చేశాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు మన తెలుగు వాడే. తెలంగాణ వాసే. ఆయనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
సిద్ధిపేట్ వాసి..
పాప చంద్ర.. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక్ మండల్ హబ్సీపూర్ గ్రామానికి చెందిన చిన్న వ్యాపారి. అదే గ్రామంలో ఓ ఆహార ఉత్పత్తుల దుకాణాన్ని నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో అతను ఆ వ్యాపారాన్ని మరింత పెంచుకోడానికి వీధుల్లో బంగాళ దుంపుల చిప్ విక్రయించాలని భావించాడు. కానీ సైకిల్ పై దానిని నిర్వహించడం కష్టమైపోతోంది. వీధి వీధి తిరగడం, చిప్స్ విక్రయించడం కష్టమైపోతోంది. ఈ క్రమంలో అతనికి ఓ బైక్ అవసరం ఏర్పడింది. కానీ బైక్ ను కొనుగోలు చేసేంత డబ్బు అతని వద్ద లేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఓ ఆలోచన తట్టింది. తన సైకిల్ నే బైక్ మార్చాలనే నిర్ణయించి, ఆచరణలో పెట్టాడు.
కేవలం రూ. 16వేల ఖర్చుతో..
పాప చంద్ర తనకు వచ్చిన ఆలోచనని ఆచరణలో పెట్టాడు. తన సైకిల్ నే ఎలక్ట్రిక్ బైక్ గా మార్చే పనులు ప్రారంభించారు. అందుకోసం ఓ బ్యాటరీ, మోటార్ ను కొనుగోలు చేశాడు. అలాగే హెడ్ లైట్, మ్యూజిక్ సిస్టమ్, స్పీడ్ కంట్రోల్ సిస్టమ్ వంటివి సమకూర్చాడు. తన సైకిల్ కి ఇవన్నీ తగిలించాడు. ఈ సందర్భంగా పాప చంద్ర మాట్లాడుతూ తన సైకిల్ ని ఎలక్ట్రిక్ బైక్ గా మార్చడానికి దాదాపు రూ. 16,000 ఖర్చైందన్నారు. అతని కష్టాన్ని, పనితీరుని గుర్తించిన స్థానికులు అతనిని అభినందించకుండా ఉండలేకపోయారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..