AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka Elections: కర్ణాటకలో కాంగ్రెస్‌కు బిగ్‌ బూస్ట్‌.. పార్టీలో చేరనున్న స్టార్‌ హీరో శివరాజ్‌కుమార్‌ సతీమణి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీకి బిగ్‌ బూస్ట్‌ లభించనుంది. కన్నడ కంఠీరవ దివంగత రాజ్‌కుమార్‌ కోడలు, శాండల్‌వుడ్‌ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌కుమార్‌ సతీమణి గీతా శివరాజ్‌కుమార్‌ ఇవాళ (ఏప్రిల్‌28) మధ్యాహ్నం కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు.

Karnataka Elections: కర్ణాటకలో కాంగ్రెస్‌కు బిగ్‌ బూస్ట్‌.. పార్టీలో చేరనున్న స్టార్‌ హీరో శివరాజ్‌కుమార్‌ సతీమణి
Shiva Rajkumar Family
Basha Shek
|

Updated on: Apr 28, 2023 | 12:37 PM

Share

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీకి బిగ్‌ బూస్ట్‌ లభించనుంది. కన్నడ కంఠీరవ దివంగత రాజ్‌కుమార్‌ కోడలు, శాండల్‌వుడ్‌ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌కుమార్‌ సతీమణి గీతా శివరాజ్‌కుమార్‌ ఇవాళ (ఏప్రిల్‌28) మధ్యాహ్నం కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. పీసీసీ అధినేత డీకే శివ కుమార్‌ ఆధ్వర్యంలో ఆమె కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సొరబ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న తన సోదరుడు మధు బంగారప్ప తరఫున గీత శివరాజ్ కుమార్ ప్రచారం చేయనున్నారు. కాగా మరో సోదరుడు కుమార బంగారప్ప ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ప్రస్తుతం ఆయనే ఇక్కడ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే. కాగా గీతా రాజ్‌కుమార్‌కు రాజకీయాలు కొత్తేమీ కాదు. ఆమె ఎవరో కాదు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కూతురే. 2014 లోక్‌సభ ఎన్నికల్లో జనతాదళ్ (సెక్యులర్) తరఫున పోటీ కూడా చేశారు. తన భార్య గీత కాంగ్రెస్‌లో చేరడాన్ని శివరాజ్‌కుమార్ సమర్థించారు. తన సతీమణితో కలిసి ప్రచారానికి వెళతానని ఆయన ప్రకటించారు. దీంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి బూస్ట్‌ లభించినట్లేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు బీజేపీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేస్తోన్న నటుడు సుదీప్ ఈ విషయంపై స్పందించారు. టీవీ 9 కన్నడతో స్పెషల్‌ ఛిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తోన్నగీతా శివరాజ్‌కుమార్‌కు తన విషెస్‌ తెలియజేశారు. అలాగే నటి రమ్యకు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. మే10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఇవాళ ధార్వాడ్, గడగ్, దావణగెరె జిల్లాల్లో ప్రచారం చేయనున్నారు. అలాగే రాహుల్‌ గాంధీ కల్బుర్గిలో పర్యటించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..