AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neeta Ambani: రోజుని రూ. 3 లక్షల టీ కప్పులో టీ తాగుతూ రోజుని ప్రారంభించే నీతా అంబానీ.. ఈ జపనీస్ టీ సెట్ వివరాలు

జపాన్‌కు చెందిన పురాతన క్రోకరీ కంపెనీ నోరిటెక్ తయారుచేసిన కప్పులో టీ తాగుతుంది. ఈ పురాతన టీ సెట్ ఒక్కో కప్పు ధర రూ.3 లక్షలకు పైగా ఉంటుంది. పురాతన జపనీస్ క్రోకరీ కంపెనీ తయారు చేసిన ఈ  మొత్తం టీ సెట్ ధర సుమారు రూ. 1.5 కోట్లకు పైగా ఉంటుంది.

Neeta Ambani: రోజుని రూ. 3 లక్షల టీ కప్పులో టీ తాగుతూ రోజుని ప్రారంభించే నీతా అంబానీ.. ఈ జపనీస్ టీ సెట్ వివరాలు
Nita Ambani Tea Cup
Surya Kala
|

Updated on: Apr 29, 2023 | 9:45 AM

Share

భారత అపర కుబేరుడు బిలియనీర్ ముఖేష్ అంబానీ భార్య , ప్రముఖ సామాజిక వేత్త నీతా అంబానీ విలాసవంతమైన జీవితంతో తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. నీతా అంబానీ విలాసవంతమైన జీవితాన్ని సంబంధించి ఏదొక సంఘటన చక్కర్లు కొడుతూ ఉంటుంది. దేశంలోని ప్రతి వ్యక్తిలాగే నీతా అంబానీ తన ఉదయాన్ని వేడి వేడి టీతో ప్రారంభిస్తోంది. అయితే నీతా అంబానీ తాను తాగే టీ కప్ మాత్రం అత్యంత ఖరీదైంది. జపాన్ లో తయారు చేసిన ఈ టీ కప్ సెట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విలాసవంతమైన టీ సెట్ గా ప్రసిద్ధిగాంచింది.

సంపన్నమైన, విలాసవంతమైన జీవనశైలి ముఖేష్ అంబానీ ఫ్యామిలీ సొంతం. ఇక భార్య నీతా అంబానీ తన ఇంట్లో ఉన్న పాత్రలు, సామాన్లు వారి స్టేటస్ సింబల్ ని చూసించే విధంగా ఉంటుంది. అందులో ఒకటి టీ కప్ సెట్. ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ రెగ్యులర్ గా టీ తాగే కప్ విలువ సుమారు రూ. 3 లక్షలు ఉంటుంది. ఈ కప్పులో టీ తాగుతూ నీతా అంబానీ తన రోజును ప్రారంభిస్తుంది.

జపాన్‌కు చెందిన పురాతన క్రోకరీ కంపెనీ నోరిటెక్ తయారుచేసిన కప్పులో టీ తాగుతుంది. ఈ పురాతన టీ సెట్ ఒక్కో కప్పు ధర రూ.3 లక్షలకు పైగా ఉంటుంది. పురాతన జపనీస్ క్రోకరీ కంపెనీ తయారు చేసిన ఈ  మొత్తం టీ సెట్ ధర సుమారు రూ. 1.5 కోట్లకు పైగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఈ టీ సెట్ మొత్తం ధర రూ. 1.5 కోట్లకు పైగా ఉండటంతో.. నీతా అంబానీ ఇంట్లోని ఒక్కో టీకప్పు ధర దాదాపు రూ. 3 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ సెట్ లోని టీ కప్పు ప్రపంచంలోని అత్యుత్తమ చైనా మట్టితో  తయారు చేయబడింది. వీటి అలంకారం కోసం ప్లాటినంతో పూత, బంగారంతో డిజైన్ చేశారు.

ముఖేష్ అంబానీ నీతా అంబానీ దంపతులు ఆరోగ్యకరమైన జీవనశైలిని గడుపుతారు. గుజరాతీ ఆహారమైన  పప్పు, రోటీ, అన్నంతో సహా భారతీయ భోజనాన్ని తీసుకుంటారు. అంతేకాదు ముఖేష్ కుటుంబం మొత్తం ప్రతి రాత్రి డిన్నర్ ఒకే సమయంలో తీసుకుంటారు.

నీతా అంబానీ తన ఖరీదైన, ప్రత్యేకమైన దుస్తులు, డిజైనర్ ఉపకరణాల కారణంగా తరచుగా వార్తల్లో నిలుస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీర నీతా అంబానీ సొంతం. ఈ ఖరీదు రూ. 40 లక్షలు. ఇక నీతా కుమార్తె ఇషా అంబానీ తన పెళ్లిలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లెహంగా ధరించింది. దీని ధర రూ. 90 కోట్ల అన్న సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..