Kamal Haasan: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంపై స్పందించిన కమల్‌హాసన్.. ఏం చెప్పారంటే
వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ప్రముఖ నటుడు, ఎంఎన్ఎం అధ్యక్షుడు కమలహాసన్ కోయంబత్తూరు నుంచి పోటీ చేస్తారనే చర్చలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై తాజాగా కమలహాసన్ స్పందించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ప్రముఖ నటుడు, ఎంఎన్ఎం అధ్యక్షుడు కమలహాసన్ కోయంబత్తూరు నుంచి పోటీ చేస్తారనే చర్చలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై తాజాగా కమలహాసన్ స్పందించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. కోయంబత్తూరు అవినాశి రోడ్డులోని కల్యాణ మండపంలో పార్టీ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల గురించి చర్చించేందుకు కోయంబత్తూరు, సేలం మండలాల ఇన్‌ఛార్జులతో కమల్‌హాసన్ సమావేశమయ్యారు. సమావేశం అనంతరం కమల్‌హాసన్ తాను పోటీ చేసే విషయంపై నిర్ణయం తీసుకోలేదని.. త్వరలో నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెంగళూరులో ప్రచారానికి వెళ్లే విషయంపై శనివారం నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.