అప్పుడే విమానం దిగిన మహిళ లగేజీలో మెరుపు..! ఏంటా అని చెక్ చేయగా.. 24 క్యారెట్ల బంగారంతో చేసిన..?
ఈ సంఘటన దేశంలో సమగ్ర తుపాకీ నియంత్రణ చర్యలను అమలు చేయడానికి దారితీసింది. ఈ ఘటన తర్వాత ర్యాపిడ్ ఫైర్ రైఫిల్స్, షాట్‌గన్‌లను నిషేధించారు. దీంతో పాటు లైసెన్సింగ్ నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు ఇతర తుపాకులను నమోదు చేశారు.
24 క్యారెట్ల బంగారు పూత పూసిన తుపాకీతో పట్టుబడిన ఓ అమెరికన్ మహిళను ఆస్ట్రేలియాలో అరెస్టు చేశారు. మహిళ లాస్ ఏంజెల్స్ నుంచి విమానంలో సిడ్నీలో దిగింది. ఆదివారం సిడ్నీకి వచ్చిన 28 ఏళ్ల మహిళకు ఆస్ట్రేలియాలో తుపాకీ కలిగి ఉండటానికి సంబంధించిన ఎలాంటి అనుమతి లేదని ఆస్ట్రేలియన్ బోర్డర్ ఫోర్స్ (ABF) ఒక ప్రకటనలో తెలిపింది. తుపాకీ కలిగి ఉండాలంటే, దానికి సంబంధించి చాలా కఠినమైన నిబంధనలను కలిగి ఉన్న ప్రపంచ దేశాలలో ఆస్ట్రేలియా ఒకటి. ఏ వ్యక్తి అయినా తెలిసి, తెలియక ముందస్తు అనుమతి లేకుండా తుపాకీని దిగుమతి చేసుకోవడం చట్టవిరుద్ధం. ఆస్ట్రేలియాలో ఈ నేరానికి 10 సంవత్సరాల జైలు శిక్ష. గోల్డెన్ గన్ కలిగి ఉన్న మహిళను స్థానిక కోర్టులో హాజరుపరచగా బెయిల్ లభించింది. ఆమె వీసా స్టేటస్, ఆస్ట్రేలియాలో బస చేయడంపై ఇప్పుడు కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. తదుపరి విచారణ తర్వాత ఎలాంటి తీర్పు వచ్చినా అమలు చేస్తారు.
సరిహద్దు దాటి దేశంలోకి అక్రమంగా వస్తున్న తుపాకులను ఆపడానికి పనిచేస్తున్న ఆయా సంస్థలతో కలిసి ABF అధికారులు కూడా పనిచేస్తున్నారు. అమెరికాలో గన్‌కల్చర్ ఇటీవల బాగా పెరిగిపోయింది. దాంతో గత కొద్ది రోజులుగా తుపాకీ కాల్పుల ఘటనలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి.
ఏప్రిల్ 1996లో, తాస్మానియాలోని పోర్ట్ ఆర్థర్‌లో ఒక షూటర్ 35 మందిని కాల్చి చంపాడు. ఈ సంఘటన దేశంలో సమగ్ర తుపాకీ నియంత్రణ చర్యలను అమలు చేయడానికి దారితీసింది. ఈ సంఘటన తర్వాత ర్యాపిడ్ ఫైర్ రైఫిల్స్, షాట్‌గన్‌లను నిషేధించారు. దీంతో పాటు లైసెన్సింగ్ నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు ఇతర తుపాకులను నమోదు చేశారు. స్విట్జర్లాండ్ స్మాల్ ఆర్మ్స్ సర్వే ప్రకారం, ఆస్ట్రేలియాలో ప్రతి 100 మందికి 14 తుపాకులు ఉన్నాయి. అమెరికాలో 100 మందిపై 120 తుపాకులు ఉన్నట్లు లెక్క.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..