AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్‌ ఈ ఎన్నికలు చాలా కాస్ట్లీ గురూ..! కోట్లలో పట్టుబడ్డ బహుమతులు.. ఆల్‌టైమ్‌ రికార్డ్‌..

హైదరాబాద్‌లోని డ్రగ్స్‌ తయారీ ల్యాబ్‌పై దాడులు, బీదర్‌లో 100 కిలోల గంజాయి ఈసారి పట్టుబడిన వాటిలో అత్యధికం. కలబురగి, చిక్కమగలూరు తదితర జిల్లాల్లో పెద్దఎత్తున చీరలు, తినుబండారాలు, బైలహొంగళ, కుణిగల్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కుక్కర్లు, ఇతర గృహోపకరణాలు స్వాధీనం చేసుకున్నట్లు కమిషన్‌ పేర్కొంది.

బాబోయ్‌ ఈ ఎన్నికలు చాలా కాస్ట్లీ గురూ..! కోట్లలో పట్టుబడ్డ బహుమతులు.. ఆల్‌టైమ్‌ రికార్డ్‌..
Goods And Freebies Seized
Jyothi Gadda
|

Updated on: May 10, 2023 | 10:44 AM

Share

ఈసారి జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రూ.375 కోట్లు ఖర్చు చేసి ఆల్ టైమ్ రికార్డు సృష్టించారు. విలువైన నగదు, డ్రగ్స్, ఉచిత బహుమతులు స్వాధీనం చేసుకున్నారు. ఇది 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ కంటే 4.5 రెట్లు ఎక్కువ అని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల కమిషన్‌ తెలిపిన వివరాల మేరకు.. మార్చి 29న కర్ణాటకలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత రూ.288 కోట్ల నగదు. విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మార్చి రెండో వారం నుంచి ఎన్నికల తేదీ ప్రకటించే వరకు రూ.83.78 కోట్ల నగదు. విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈసారి 18 అసెంబ్లీ నియోజకవర్గాలను కాస్ట్ సెన్సిటివ్ ప్రాంతాలుగా గుర్తించారు. అభ్యర్థుల ఖర్చులపై నిఘా పెరగడం, పొరుగు రాష్ట్రాలతో మరింత సమన్వయం, వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం వల్ల అక్రమాలను భారీగా గుర్తించగలిగామని కమిషన్ పేర్కొంది.

కోలారు జిల్లా బంగారుపేటలో రూ.4.04 కోట్ల నగదు, హైదరాబాద్‌లోని డ్రగ్స్‌ తయారీ ల్యాబ్‌పై దాడులు, బీదర్‌లో 100 కిలోల గంజాయి ఈసారి పట్టుబడిన వాటిలో అత్యధికం. కలబురగి, చిక్కమగలూరు తదితర జిల్లాల్లో పెద్దఎత్తున చీరలు, తినుబండారాలు, బైలహొంగళ, కుణిగల్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కుక్కర్లు, ఇతర గృహోపకరణాలు స్వాధీనం చేసుకున్నట్లు కమిషన్‌ పేర్కొంది.

అధికారులు స్వాధీనం లిస్ట్‌ పరిశీలించినట్టయితే..

ఇవి కూడా చదవండి

నగదు విలువ రూ.147 కోట్లు

విరాళం విలువ రూ. 24 కోట్లు

మద్యం రూ. 83 కోట్లు

డ్రగ్స్ విలువ రూ. 24 కోట్లు

బంగారం, వెండి విలువ రూ. 96 కోట్లు

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..