Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మస్త్‌ బిజినెస్‌ గురూ..! ఆన్‌లైన్‌లో అమ్మకానికి నులక మంచం.. ధర కేవలం రూ.1లక్ష పైనే..

భారతదేశంలోని చిన్న తరహా పరిశ్రమ నుండి సేకరించినట్టుగా చెప్పారు. దీని తయారీ కోసం జ్యూట్ తాడు, కలపను ఉపయోగించారు. ఈ మంచం వెడల్పు 36 అంగుళాలు, పొడవు 72 అంగుళాలు. అవును మరి, చివరికి ఈ మంచం ధరను ఆన్ లైన్ లో లక్షకు పైగా ధరతో అమ్మకానికి పెట్టారు.

మస్త్‌ బిజినెస్‌ గురూ..!  ఆన్‌లైన్‌లో అమ్మకానికి నులక మంచం.. ధర కేవలం రూ.1లక్ష పైనే..
Indian Bed
Follow us
Jyothi Gadda

|

Updated on: May 10, 2023 | 8:58 AM

జనపనారతో అల్లిన మంచం మీకు గుర్తుందా? అవును అదే… అప్పటి కాలంలో గ్రామాల్లో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కనిపించేది. ఊరిలో ఈ మంచమ్మీద పడుకుని ఆకాశం వైపు చూస్తూ స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తుంటే ఆ ఆనందమే వేరు. అంతేనా?. ఎలా పడితే అలా ఈ మంచమ్మీద దూకుతూ ఆడేకునే వాళ్లు. అయితే, అప్పుడప్పుడు తాడు వదులుగా మారటంతో ఆ సందుల్లోంచి కాళ్లు కిందకు పడేవి. కానీ తర్వాత ఇంట్లోని పెద్దవాళ్లు ఆ తాడును గట్టిగా లాగి బిగించేవారు. మొత్తంమీద ఈ నులక మంచంతో మనందరికీ అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి. అయితే, ఈ మంచానికి ఎంత ఖర్చవుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే, ఇంటర్నెట్‌లో అమ్ముడవుతున్న ఈ మంచం ధర తెలిస్తే..మీరు షాక్‌ అవ్వాల్సిందే.. ఎందుకంటే .. ఈ దేశీ కాట్‌ని ఎవరో లక్ష రూపాయలకు పైగా ధరకు విక్రయిస్తున్నారు.

Etsy.com అనే వెబ్‌సైట్ ఉంది. ఇక్కడ అనేక రకాల మంచాలు, ఇతర వస్తువులను ఆన్‌లైన్‌లో విక్రయిస్తారు. ఇక్కడ ఈ దేశీ మంచం ‘ఇండియన్ ట్రెడిషనల్ బెడ్ వెరీ బ్యూటిఫుల్ డెకర్’ పేరుతో అందుబాటులో ఉంది. ఇది చేతితో తయారు చేసినట్టుగా వివరాల్లో వెల్లడించారు. భారతదేశంలోని చిన్న తరహా పరిశ్రమ నుండి సేకరించినట్టుగా చెప్పారు. దీని తయారీ కోసం జ్యూట్ తాడు, కలపను ఉపయోగించారు. ఈ మంచం వెడల్పు 36 అంగుళాలు, పొడవు 72 అంగుళాలు. అవును మరి, చివరికి ఈ మంచం ధరను రూ.1,12,213గా అమ్మకానికి పెట్టారు. ఇది చూసిన నెటిజన్లు అయ్యాబాబోయ్‌ అంటూ తల పట్టుకుంటున్నారు.

ఆసక్తికరంగా, ఈ ధరకు విక్రయించబడుతున్న ఈ సైట్‌లోని మంచం ఇది మాత్రమే కాదు. ఈ సైట్‌లో ఇటువంటి అనేక మంచాలు ఉన్నాయి. దీని ధర 40 వేల నుండి 1 లక్ష వరకు ఉంటుంది. అందుకే చుట్టుపక్కల వాళ్లకు ఈ మంచానికి ఉన్న ధర చెప్పగానే కంగుతిన్నారు. అయితే, మేం కూడా సొంతంగా మంచం వ్యాపారం ప్రారంభిస్తామంటూ కామెంట్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..