Viral Video: ‘మ్యాగీ తో దోసె’ తయారీ.. ఈ టార్చర్‌ మాకొద్దంటున్న నెటిజన్లు.. వీడియో వైరల్‌

ఇదేం టార్చర్‌రా బాబు అంటూ ఫన్నీగా చెప్పాడు. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దీనిపై స్పందించారు. ఇదేం వెరైటీరా నాయనా అంటూ తలలు పట్టుకుంటున్నారు. దోస ప్రియులంతా మ్యాగీ దోస ప్రయోగానికి వ్యతిరేకంగా కామెంట్స్‌ చేస్తున్నారు. దోసెతో ఇలాంటి ప్రయోగాలు చేయొద్దు సామీ అంటూ..మరికొందరు వ్యాఖ్యానించారు.

Viral Video: 'మ్యాగీ తో దోసె' తయారీ.. ఈ టార్చర్‌ మాకొద్దంటున్న నెటిజన్లు.. వీడియో వైరల్‌
Maggi Dosa
Follow us
Jyothi Gadda

|

Updated on: May 10, 2023 | 7:48 AM

సోషల్ మీడియాలో మనం ప్రతిరోజూ ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్‌కు సంబంధించిన వీడియోలను చూస్తుంటాం..ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆయా ప్రదేశాల రుచులను తెలుసుకునే వీడియోలు, ప్రత్యేక రుచులను పరిచయం చేసే వీడియోలు, స్ట్రీట్‌ ఫుడ్‌కు సంబంధించినవి, అక్కడి సంస్కృతీ, సంప్రదాయాలకు సంబంధించిన వీడియోలు కూడా అనేకం చూస్తుంటాం. అయితే, ఫుడ్ వీడియోలలో వైవిధ్యం ఉన్నందున కొందరు నెటిజన్ల దృష్టిని ఆకర్షించడానికి వెరైటీ ఫుడ్ వీడియోలను తయారు చేస్తుంటారు. ఈ క్రమంలోనే కొత్త కొత్త వంటకాలకు సంబంధించిన వీడియోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. అలాంటిదే ఇక్కడ కూడా ఒక కొత్త రెసిపీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చాలామందికి ఇష్టమైన అల్పాహారం దోశ. ఈ దోశల్లో మనకు ఎన్నో వెరైటీలు ఉన్నాయి. అయితే మ్యాగీతో దోసను తయారు చేయటం ఎప్పుడైనా చూశారా..? ఇక్కడ అలాంటి ప్రయోగాత్మక వీడియోను షేర్ చేశారు ఒక ఖాతాదారు. ‘ది కుర్తా గై’ అనే ఖాతాదారుడు చేసిన వీడియో అత్యంత విశేషమైనది. దోశని ఇలా ఎందుకు చేస్తున్నాడో, ఇదేం టార్చర్‌రా బాబు అంటూ ఫన్నీగా చెప్పాడు. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దీనిపై స్పందించారు. ఇదేం వెరైటీరా నాయనా అంటూ తలలు పట్టుకుంటున్నారు. దోస ప్రియులంతా మ్యాగీ దోస ప్రయోగానికి వ్యతిరేకంగా కామెంట్స్‌ చేస్తున్నారు. దోసెతో ఇలాంటి ప్రయోగాలు చేయొద్దు సామీ అంటూ..మరికొందరు వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Vividh 2.0 (@thekurtaguy)

అయితే, మ్యాగీతో దోశ చేయటానికి ముందుగా మాగీని గ్రైండ్ చేసి పిండిలా తయారు చేసుకున్నాడు. ఆ పిండితో పెనంపై దోసెలా వేసుకుని ఎర్రగా కాల్చుకున్నాడు. ఆ తర్వాత దాని పైన మ్యాగీ మసాలా కూడా వేశాడు..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..