Pre wedding shoot: ప్రీ వెడ్డింగ్ షూట్‌లో షాకిచ్చిన కెమెరామెన్.. సిగ్గుతో తల దించుకున్న వధువు..! వీడియో వైరల్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో నది ఒడ్డున ఉన్న అందమైన ప్రదేశంలో ఫోటో షూట్ కోసం వధూవరులు సిద్దంగా ఉన్నారు. వధువు నీలిరంగు గౌను, వరుడు నల్ల ప్యాంటు, తెల్లటి చొక్కా ధరించి ఉన్నారు. కెమెరామెన్‌తో పోజులివ్వడాన్ని మనం చూడొచ్చు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ సీజన్ నడుస్తోంది. పెళ్లికి ముందు వధూవరులు ప్రీ-వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్ చేసుకోవటం ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఇందుకోసం ముందుగా ఇరు కుటుంబాల అంగీకారంతో మంచి ప్రదేశాన్ని ఎంపిక చేసుకుంటారు. ఆ తర్మాత మంచి లోకెషన్‌లో అందమైన స్టైల్స్ అంతే అందంగా ఫోటోలు, వీడియోలు షూట్ చేస్తారు. అయితే, ఫోటో షూట్‌లో కెమెరామెన్ వధూవరులను రకరకాల భంగిమల్లో ఫోటోకు పోజులివ్వమని చెబుతుంటారు..కొన్ని కొన్ని సందర్బాల్లో అతనే స్వయంగా వాటిని చూపిస్తాడు. ఆ విధంగా ఇద్దరు కెమెరామెన్లు ఆ సన్నివేశాన్ని వధూవరులకు వివరిస్తూ సాగే ప్రేమ సన్నివేశమే సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. వీరి పని చూసి వధూవరులు నిజంగానే షాక్ అయ్యారు. ఈ వీడియో పోస్ట్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో నది ఒడ్డున ఉన్న అందమైన ప్రదేశంలో ఫోటో షూట్ కోసం వధూవరులు సిద్దంగా ఉన్నారు. వధువు నీలిరంగు గౌను, వరుడు నల్ల ప్యాంటు, తెల్లటి చొక్కా ధరించి ఉన్నారు. కెమెరామెన్‌తో పోజులివ్వడాన్ని మనం చూడొచ్చు. వారి దగ్గర ఇద్దరు కెమెరామెన్లు కనిపిస్తారు. ఏ సన్నివేశాన్ని చిత్రీకరించాలో కెమెరామెన్‌లు చూపించడం తదుపరి సన్నివేశం. అయితే అది చూసిన వధూవరులు నిజంగానే షాక్ అయ్యారు. వీడియో చూడండి…
View this post on Instagram
వధూవరుల ఫోటో షూట్ సందర్భంగా ఈ వింత దృశ్యం వైరల్ అవుతోంది. ఈ వీడియోపై సోషల్ మీడియా అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో Instagram ఖాతా videonation.teb ద్వారా అప్‌లోడ్ చేయబడింది. వీడియోకు 18.2 k వీక్షణలు, చాలా లైక్‌లు వచ్చాయి
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..