పాలక వర్కర్స్ పార్టీని మరింత బలోపేతం చేసిన నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ….పొలిట్ బ్యూరోకు కొత్త సభ్యుల నియామకం
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తమ పాలక వర్కర్స్ పార్టీని మరింత బలోపేతం చేశారు. పార్టీలో అత్యంత శక్తిమంతమైన పొలిట్ బ్యూరోకు కొత్త సభ్యులను నియమించారు. దేశం ఎన్నడూ లేని క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తమ పాలక వర్కర్స్ పార్టీని మరింత బలోపేతం చేశారు. పార్టీలో అత్యంత శక్తిమంతమైన పొలిట్ బ్యూరోకు కొత్త సభ్యులను నియమించారు. దేశం ఎన్నడూ లేని క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో పార్టీ సెంట్రల్ కమిటీ..నాలుగవది, చివరిదైన సమావేశాన్ని గత మంగళవారం నిర్వహించింది. సంస్థాగత, సిధ్ధాంతపరమైన ప్రతిపాదనలతో కేంద్ర నాయకత్వాన్ని పరిపుష్టం చేయడానికి తీసుకోవలసిన చర్యలను ఈ కమిటీ సమీక్షించింది. ప్రజల ఆశయాలు, ఆశలకు అనుగుణంగా పని చేయలేకపోయామని కొందరు సభ్యులు పశ్చాత్త్తాపం వ్యక్తం చేయగా …మీ లైఫ్ స్టయిల్ లో పెను సమస్యలున్నాయని, వాటిని మార్చుకోవాలని కిమ్ సూచించినట్టు తెలిసింది. అయితే తప్పకుండా మీ అదేశాలను పాటిస్తామని వారు వ్యాఖ్యానించారట. పొలిట్ బ్యూరోలో కొత్త సభ్యునిగా సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ ప్రిసీడియం వైస్ ప్రెసిడెంట్ థా హ్యాంగ్ చొల్ ని సెంట్రల్ కమిటీ ఎన్నుకుంది. అలాగే పార్టీకి చెందిన సెంట్రల్ ఆడిటింగ్ కమిషన్ సభ్యుడు యుసాంగ్ చొల్ ని ప్రత్యామ్నాయ మెంబర్ గా ఎన్నుకున్నారు. కేంద్ర నాయకత్వ బలోపేతంతో బాటు దేశంలోని తాజా క్లిష్ట పరిస్థితులను ఎలా అధిగమించాలో వీరు సూచ్చిస్తారట.
దేశంలో ఆహార కొరత తీవ్రంగా ఉందని, కరోనా వైరస్ పాండమిక్ కారణంగానూ… గత ఏడాది సంభవించిన తుపానుల వల్లను దేశ ఎకానమీ క్షీణించిందని గత సమావేశాల్లో పేర్కొన్న కిమ్…ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు పార్టీ.. ప్రభుత్వం కృత నిశ్చయంతో కృషి చేయాల్సి ఉందని అన్నారు. ఇంకా అమెరికాతో ఇటు చర్చలకు, అటు ఆ దేశాన్నిదీటుగా ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని సైతం ఆయన తమ పార్టీని కోరారు. జోబైడెన్ అమెరికా అధ్యక్షుడైన తరువాత కిమ్ జోంగ్ ఉన్ మొదటిసారిగా ఇలా వ్యాఖ్యానించజడం విశేషం. ..
మరిన్ని ఇక్కడ చూడండి: ఎత్తిన కత్తి దించితే ఒట్టు.. అమేజింగ్ వీడియో వైరల్..!మహిళ అరుదైన ప్రతిభ :woman playing sword viral video.
Viral Video : పెళ్లి కూతురు డ్రెస్సు నుండి బయటకు వచ్చిన వ్యక్తి వైరల్ అవుతున్న వీడియో .