అనుమానాస్పద స్థితిలో ప్రముఖ చైనీస్ అణు శాస్త్రజ్ఞుని మృతి……పోలీసుల దర్యాప్తు ప్రారంభం

చైనాలో ప్రముఖ అణు శాస్త్రజ్ఞుడు అనుమానాస్పద స్థితిలో మరణించారు. హార్బిన్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ జాంగ్ జిజాన్ ఈ నెల 17 న ఓ భవనంపై నుంచి పడి మృతి చెందారు.

అనుమానాస్పద స్థితిలో ప్రముఖ చైనీస్ అణు శాస్త్రజ్ఞుని మృతి......పోలీసుల దర్యాప్తు ప్రారంభం
Zhang Zhijun
Umakanth Rao

| Edited By: Phani CH

Jun 19, 2021 | 6:04 PM

చైనాలో ప్రముఖ అణు శాస్త్రజ్ఞుడు అనుమానాస్పద స్థితిలో మరణించారు. హార్బిన్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ జాంగ్ జిజాన్ ఈ నెల 17 న ఓ భవనంపై నుంచి పడి మృతి చెందారు. పోలీసులు ఈ ఘటనపై ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినప్పటికీ.. ఇది హత్యా ఆత్మహత్యా అన్నదానిపై ఇంకా నిర్ధారణకు రాలేకపోయారు. అయితే దర్యాప్తు చురుకుగా జరుగుతోందని వారు చెప్పారు., జాంగ్ మృతిపై యూనివర్సిటీ తీవ్ర సంతాపం తెలిపింది. కానీ ఈ సంస్థ వెబ్ సైట్ లోని ‘లీడర్ షిప్’ విభాగంలో ఈయన పేరు ఇంకా అలాగే ఉంది. చైనీస్ న్యూక్లియర్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్.. న్యూక్లియర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రొఫెసర్ కూడా అయిన జాంగ్.. పలు అవార్డులు అందుకున్నారని, ముఖ్యంగా 2019 లో చైనా అణు కార్యక్రమ పితామహుని పేరిట ఏర్పాటు చేసిన క్సియాన్ శాంక్వియాంగ్ టెక్నాలజీ అవార్డును అందుకున్నారని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. అంతకు ముందు గత మే నెలలో కూడా ఆయన నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్నోవేషన్ పురస్కారాన్ని కూడా అందుకున్నట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి.

ఈయన మృతికి రెండు రోజుల ముందు ఇన్ జింగ్వీ అనే మరో ప్రొఫెసర్ ని యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ గా నియమించారు. బహుశా ఈ కారణం వల్ల తనకు పదవి దక్క లేదని భావించి ఈ అణు శాస్త్రజ్ఞుడు భవనం మీది నుంచి దూకి సూసైడ్ చేసుకున్నారా అని భావిస్తున్నారు. కాగా చైనా అణు కార్యక్రమంపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే అమెరికా-చైనా మధ్య సఖ్యత లేకపోవడం గమనార్హం.

మరిన్ని ఎక్కడ చూడండి:  Double Murders : ఉలిక్కిపడ్డ అరవేడు గ్రామస్తులు.. కారుతో ఢీకొట్టి, ఆపై రాళ్లతో కొట్టి ఇద్దరిని నడి రోడ్డుపై చంపేసిన ప్రత్యర్థులు

Case against Nara Lokesh: టీడీపీ నేత నారా లోకేష్‌‌పై కేసు నమోదు.. లాక్‌డౌన్ నిబంధనలు బేఖాతరే కారణమా..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu