Double Murder : ఉలిక్కిపడ్డ అరవేడు.. కారుతో ఢీకొట్టి, ఆపై రాళ్లతో కొట్టి ఇద్దరిని నడి రోడ్డుపై చంపేసిన ప్రత్యర్థులు

అనంతపురం డబుల్ మర్డర్ ఉదంతం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. యల్లనూరు మండలం అరవేడు గ్రామం సమీపంలో మోటార్ బైక్ పై వెళ్తున్న..

Double Murder : ఉలిక్కిపడ్డ  అరవేడు..  కారుతో ఢీకొట్టి, ఆపై రాళ్లతో కొట్టి ఇద్దరిని నడి రోడ్డుపై చంపేసిన ప్రత్యర్థులు
Double Murder
Follow us

|

Updated on: Jun 19, 2021 | 9:07 PM

Anantapuram district double murders : అనంతపురం డబుల్ మర్డర్ ఉదంతం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. యల్లనూరు మండలం అరవేడు గ్రామం సమీపంలో మోటార్ బైక్ పై వెళ్తున్న నారాయణప్ప, రాజగోపాల్ అనే ఇద్దరు వ్యక్తులను కారుతో ఢీ కొట్టి.. ఆ తర్వాత రాళ్లతో కొట్టి దుండగులు చంపేసిన సంగతి తెలిసిందే. పొలం లోని బోర్వెల్ వ్యవహారంలో రెండు కుటుంబాల మధ్య మొదలైన వివాదం కారణంగా నారాయణప్ప, రాజగోపాల్ ను ప్రత్యర్థులు కొట్టి చంపినట్టు సమాచారం. అనంతరం అక్కడి నుంచి దాడిచేసిన వారంతా పరారయ్యారు.

డబుల్ మర్డర్ తో ఒక్కసారిగా గ్రామస్తులు ఉలిక్కి పడ్డారు. చంపిన వారు, చనిపోయిన వారు ఇద్దరు కూడా తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గీయులని భావిస్తున్నారు. డబుల్ మర్డర్ జరిగిన ఘటనా స్థలానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, డిఎస్పి చైతన్య హుటా హుటీన చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఘటనపై ఆరాతీస్తున్నారు.

భార్య-భర్త గొడవ : వాటర్ బాటిల్ తెచ్చుకుంటానని పోలీస్ స్టేషన్ నుంచి బయటికొచ్చిన ఆ భర్త ఏం చేశాడంటే.. !

కృష్ణా జిల్లాలో ఓ భర్త అర్థాంతరంగా తనువు చాలించాడు. తరుచు భార్యతో జరుగుతున్న గొడవలతో మనస్థాపం చెంది ఇక చేసేదేమీ లేదనుకుని ఇంటికి వెళ్లి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. పమిడి ముక్కల మండలం, వీరంకి గ్రామానికి చెందిన మరీదు అవినాష్.. వీరంకి గ్రామానికి చెందిన కాసాని దేవీ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలంగా భర్తతో మనస్పర్థల కారణంగా విడాకులు కోరుతూ దేవి కోర్టుకెళ్లింది.

ఈ క్రమంలో నిన్న అవినాష్ ఇంటికి వెళ్లిన దేవి.. భర్త కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. దేవి వైఖరిపై పమిడిముక్కల పోలీస్ స్టేషన్ లో భర్త అవినాష్ ఫిర్యాదు చేశాడు. దీంతో వివాదంపై పోలీసులు ఇరువర్గాలను పిలిచి మాట్లాడుతుండగా అవినాష్ కుటుంబ సభ్యులపై స్టేషన్లోనే దేవి చేయి చేసుకున్నట్టు చెబుతున్నారు. దేవి వైఖరితో మనస్తాపం చెందిన అవినాష్.. వాటర్ బాటిల్ తెచ్చుకుంటానని పోలీస్ స్టేషన్ నుండి బయటికి వెళ్లి, వీరంకి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య దేవి పెట్టిన వేధింపులు, పోలీసుల అలసత్వం వల్లనే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని అవినాష్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read also : Kodali Nani : నారా లోకేష్, చంద్రబాబుపై మళ్లీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఏపీ మంత్రి కొడాలి నాని