AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Case against Nara Lokesh: టీడీపీ నేత నారా లోకేష్‌‌పై కేసు నమోదు.. లాక్‌డౌన్ నిబంధనలు బేఖాతరే కారణమా..!

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై కేసు నమోదైంది. కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు.

Case against Nara Lokesh: టీడీపీ నేత నారా లోకేష్‌‌పై కేసు నమోదు.. లాక్‌డౌన్ నిబంధనలు బేఖాతరే కారణమా..!
Nara Lokesh
Balaraju Goud
|

Updated on: Jun 19, 2021 | 5:56 PM

Share

Police case against Nara Lokesh: తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై కేసు నమోదైంది. కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో లాక్‌డౌన్ నిబంధనలు బేఖాతరు చేసినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు.

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కాంలో అరెస్టయిన సందర్భంలో పరామర్శ కోసం సూర్యారావుపేట కోర్టు సెంటర్‌కు నారా లోకేష్‌, కొల్లు రవీంద్రతో పాటు పలువురు టీడీపీ నేతలు వెళ్లారు. ఈ సమయంలో లోకేష్‌ కరోనా నిబంధనలు పట్టించుకోలేదని పలువురు ఆయనపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎపిడమిక్‌ యాక్ట్‌ ప్రకారం కరోనా వ్యాప్తికి కారణమయ్యారంటూ నారా లోకేష్‌, కొల్లు రవీంద్ర తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు, గతేడాది జూన్‌ 12న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసలు ఇప్పుడు వివరణ ఇవ్వాలని నోటీసులు పంపారు.

Read Also… No Mask Countries: కొన్ని దేశాల్లో మాస్కులకు గుడ్ బై.. ‘ఆ’ అయిదు దేశాలేవంటే?