Group Attack: గుంటూరులో ఆకతాయిల హల్ చల్.. పెట్రోల్ బంక్ వర్కర్‌పై దాడి.. ఆపై కాళ్ల బేరానికి..
Group Attack: గుంటూరు జిల్లాలో కొందరు ఆకతాయిలు మధ్యం మత్తులో హల్‌చల్ చేశారు. ఆరుగురు ఆకతాయిలు మద్యం మత్తులో పెట్రోల్ బంక్..
Group Attack: గుంటూరు జిల్లాలో కొందరు ఆకతాయిలు మధ్యం మత్తులో హల్‌చల్ చేశారు. ఆరుగురు ఆకతాయిలు మద్యం మత్తులో పెట్రోల్ బంక్ వర్కర్‌పై దాడికి పాల్పడ్డారు. ఆ తరువాత విషయం పోలీసుల వద్దకు వెళ్లడంతో రాజీకి బేరాలు ఆడుతున్నారు. గుంటూరు జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించిన ఈ ఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం నాడు ఆరుగురు వ్యక్తులు ఫుల్లుగా మద్యం సేవించారు. అనంతరం పెట్రోల్ బంక్‌కు వెళ్లారు. అక్కడ పని చేస్తున్న ఓ కుర్రాడితో వాగ్వాదానికి దిగారు. ఆ క్రమంలో కుర్రాడిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఆరుగురు వ్యక్తులు కలిసి ఒక్కడిని దారుణంగా కొట్టారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ ఘటన అంతా పెట్రోల్ బంక్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలో రికార్డ్ అయ్యింది. కాగా, ఆకతాయిల దాడిలో గాయపడిన యువకుడు బంక్ యజమాని సాయంతో పోలీసులను ఆశ్రయించాడు. తనపై దాడికి పాల్పడిన వారిపై ఫిర్యాదు చేశాడు. ఆధారంగా సిసి కెమెరా ఫుటేజీని పోలీసులకు అందించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే, యువకుడిపై దాడికి పాల్పడిన వారు అధికార పార్టీకి చెందిన నేతలకు దగ్గరి వారు కావడంతో.. రాజీకి రమ్మంటూ బంక్ యజమానిపై అధికార పార్టీ నేతలు ఒత్తిళ్లు చేస్తున్నారు. యువకుడు మాత్రం తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాడు.
Also read:
అనుమానాస్పద స్థితిలో ప్రముఖ చైనీస్ అణు శాస్త్రజ్ఞుని మృతి……పోలీసుల దర్యాప్తు ప్రారంభం