Kodali Nani : నారా లోకేష్, చంద్రబాబుపై మళ్లీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఏపీ మంత్రి కొడాలి నాని
టీడీపీ నేత నారా లోకేష్ నిన్నటి కర్నూలు జిల్లా పర్యటనలో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను మంత్రి కొడాలి నాని తీవ్రంగా ఖండించారు...
Kodali Nani counter attack on Nara Lokesh and Chandrababu : టీడీపీ నేత నారా లోకేష్ నిన్నటి కర్నూలు జిల్లా పర్యటనలో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను మంత్రి కొడాలి నాని తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు 14 ఏళ్లు అధికారంలో ఉన్న సమయంలో హత్యలు జరగలేదా? వైయస్‌ఆర్‌సీపీ నేతల హత్యలకు చంద్రబాబు బాధ్యత వహిస్తాడా..? అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. ఎక్కడో గ్రామాల్లో జరిగే గొడవలను సీఎంకు ఆపాదించడం కరెక్టు కాదన్నారు. ఈ క్రమంలో లోకేష్ పై తీవ్ర పదజాలంతో కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు. “అచ్చొచ్చిన అంబోతులా కొడుకును చంద్రబాబు రోడ్లపైకి వదిలాడు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. తండ్రీ కొడుకులు నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే బడిత పూజ చేస్తారు” అని కొడాలి హెచ్చరించారు.
తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొడాలి నాని మాట్లాడారు. “పప్పుగాడు, తుప్పుగాడు ఇద్దరు ఇంటికి పరిమితమై ఏమీ చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో జూమ్ యాప్ పెట్టి.. ప్రజల్లో వైయస్ జగన్‌పై వ్యతిరేక భావనలు తెచ్చేందుకు మాట్లాడుతున్నారు. పేజీలకు పేజీలు లేఖలు రాసి ప్రెస్‌కు విడుదల చేయం.. గ్రామ రాజకీయాలతో ఎవరో చనిపోతే ఈ పప్పుగాడు కర్నూలు వెళ్లి.. సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని అరే.. ఒరే అని మాట్లాడుతున్నాడు.” అంటూ ఫైరయ్యారు కొడాలి.
“చంద్రబాబూ..నీవు మనిషివేనా? అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా?. నీ ప్రభుత్వ హయాంలో రైతులకు బకాయిలు కట్టకుండా వదిలేస్తే ..మేమెచ్చిన తరువాత ఆ బకాయిలు చెల్లించాం. రూ.996 కోట్లు రైతులకు ధాన్యం కొనుగోలు బకాయిలు సీఎం వైయస్ జగన్ చెల్లించాడు. ఇన్‌ఫుట్ సబ్సిడీ , పావలా వడ్డీ రుణాలు అన్ని కలిపి దాదాపు రూ.4 వేల కోట్లు చంద్రబాబు రైతులకు ఇవ్వాల్సిన బాకీలను 2019లోనే సీఎం కాగానే మూడు నెలల్లో చెల్లించిన రైతు బాంధవుడు సీఎం వైయస్ జగన్. అలాంటి ముఖ్యమంత్రిపై నీవు విషం కక్కుతున్నావు.” అంటూ కొడాలి నాని చంద్రబాబు, లోకేష్ లపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
ప్రాణాలు పోతుంటే మీకేం పట్టదా.. పరిహారం చెల్లింపులో ఎందుకింత పరిహాసం.. సీఎంకు షర్మిల సూటిప్రశ్న