TS Cabinet : క్షవర వృత్తిలో వున్న నాయీ బ్రాహ్మణుల కోసం గ్రామాల్లో మోడ్రన్ సెలూన్లను తక్షణమే ఏర్పాటు చేయండి : కేబినెట్
గొర్రెల పెంపకం వృత్తిలో వున్న యాదవులకు గొర్రెల పెంపకం పథకాన్ని తిరిగి ప్రారంభించాలని తెలంగాణ కేబినెట్ అధికారులను ఆదేశించింది. క్షవర వృత్తిలో వున్న నాయీ బ్రాహ్మణుల కోసం..
Handloom workers Insurance payments : గొర్రెల పెంపకం వృత్తిలో వున్న యాదవులకు గొర్రెల పెంపకం పథకాన్ని తిరిగి ప్రారంభించాలని తెలంగాణ కేబినెట్ అధికారులను ఆదేశించింది. క్షవర వృత్తిలో వున్న నాయీ బ్రాహ్మణుల కోసం గ్రామాల్లో మోడ్రన్ సెలూన్లను తక్షణమే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చేనేత, గీత కార్మికులకు త్వరితగతిన బీమా అందించడానికి చర్యలు తీసుకోవాలని తెలిపింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ అత్యవసరంగా భేటీ అయిన మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు చేసింది. మత్స్య కార్మికులకు, గీత కార్మికులకు అందించాల్సివున్న ఎక్స్ గ్రేషియా ను వెంటనే విడుదల చేయాలని, వివిధ వృత్తి కులాలకు ఎంబీసీ కర్పోరేషన్ కు నిధులు విడుదల చేయాలని కేబినెట్ ఆదేశించింది.
రైతులకు బీమా సత్వరమే అందిస్తున్నట్టుగానే, వృత్తి కులాలకు కూడా సత్వరమే బీమా చెల్లింపులు అందే విధంగా ఏర్పాట్లు చేయాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది. ఇక, రాష్ట్రంలో గత సంవత్సరం వరి ధాన్యం దిగుబడి 3 కోట్ల టన్నుల పైచిలుకుగా ఉందని వ్యవసాయ శాఖ కేబినెట్ కు తెలిపింది. ఈసారి ఇప్పటికే సాధారణ వర్షపాతం కంటే 60 శాతం ఎక్కువ వానలు పడ్డాయని, గత సంవత్సరం కంటే 5 శాతం ఎక్కువగా వర్షాపాతం నమోదయ్యిందని వ్యవసాయ శాఖ కేబినెట్ కు వివరించింది.
ముగిసిన సీజన్ లో పండిన 1.4 కోట్ల వరి ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించిందని., 1.6 కోట్ల టన్నుల ధాన్యాన్ని వ్యాపారులు కొన్నారని మార్కెటింగ్ శాఖ వివరించింది. 5145 కోట్ల రూపాయలు రైతుబంధు పైసలు రైతుల ఖాతాల్లో జమయ్యాయని వ్యవసాయ శాఖ కేబినెట్ కు తెలిపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు, కరోనా కష్టకాలంలో కూడా ధాన్యం సేకరణను రికార్డు స్థాయిలో జరిపిన పౌర సరఫరా, గ్రామీణాభివృద్ధి మరియు సంబంధిత శాఖల అధికారులను.. సిబ్బందిని కేబినెట్ ఈ సందర్భంగా అభినందించింది.