World Wide Coronavirus: ప్రపంచదేశాల్లో ఆగని కరోనా కల్లోలం.. నాలుగు మిలియన్లు దాటిన మరణాల సంఖ్య
World Wide Coronavirus: చైనా పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసింది. గత ఏడాదిన్నర కాలం నుంచి అనేక దేశాలలో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి.
World Wide Coronavirus: చైనా పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసింది. గత ఏడాదిన్నర కాలం నుంచి అనేక దేశాలలో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా అధికంగా ఉండి ఆందోళన కలిస్తుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా తో మరణించినవారి సంఖ్య నాలుగు మిలియన్ల దాటింది.
ప్రజలకు వైద్యం అందించడంలో అగ్రస్థానంలో ఉండే అగ్రరాజ్యం అమెరికా కూడా కరోనా కోరల్లో చిక్కుకుని కకావికలం అయ్యింది. ఓ వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి కావొస్తున్నా ఇంకా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇజ్రాయిల్ వంటి కొన్ని దేశాలు తప్ప భారత్ సహా అనేక దేశాలు కరోనా ను జయించడానికి పోరాడుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి 40 లక్షల మంది మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 1,78,581,229 నమోదయ్యాయి. ఒక్క శనివారం రోజునే ప్రపంచ వ్యాప్తంగా 3,97,590 కొత్త కేసులు నమోదయ్యాయి.
అమెరికా, బ్రెజిల్, భారత్, రష్యా, మెక్సికో దేశాల్లో మరణాల సంఖ్య అధికంగా ఉంది. మరోవైపు ఆఫ్రికా దేశాల్లో కూడా కరోనా విలయతాండవం కొనసాగుతుంది. భారత్ లో సెకండ్ వేవ్ సృష్టించిన విలయతాండవం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. అయితే రష్యాలో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. అక్కడ కూడా మలేలే రోజువారీగా అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి
Also Read: రెగ్యులర్ టిఫిన్స్ తో బోర్ కొడుతుందా..అయితే ఓట్స్ తో వెజ్ కిచిడీ ట్రై చేస్తే సరి