Nepal Floods: నేపాల్ లో వరదల భీభత్సం కొండచరియలు విరిగిపడి 16మంది మృతి, 22 మంది గల్లంతు

Nepal Floods: నేపాల్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు భీభత్సం సృస్తిస్తున్నాయి. వర్షాలు, వరదల కార‌ణంగా కొండ చరియలు విరిగిపడి 16 మంది ప్రాణాలు..

Nepal Floods: నేపాల్ లో వరదల భీభత్సం కొండచరియలు విరిగిపడి 16మంది మృతి, 22 మంది గల్లంతు
Nepla Floods
Follow us
Surya Kala

|

Updated on: Jun 19, 2021 | 1:54 PM

Nepal Floods: నేపాల్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు భీభత్సం సృస్తిస్తున్నాయి. వర్షాలు, వరదల కార‌ణంగా కొండ చరియలు విరిగిపడి 16 మంది ప్రాణాలు కోల్పోగా, 22 మంది గ‌ల్లంత‌య్యారు. మృతుల్లో విదేశీయులున్నారని హోమ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. అరడజనుకు పైగా జిల్లాల్లో భారీ వరదలు ఏర్పడ్డాయని… కొండచరియలు విరిగిపడుతుండ‌డంతో ప్ర‌భావిత ప్రాంతాల ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వర్షాలు, వరదల వలన కలిగినియా నష్టం గురించి వేయలేదని ..బాధితులకు సహాయం చేయడంపైనే ప్రస్తుతం తమ దృష్టి ఉందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పుడు బాధితవారికి సహాయక సామగ్రిని అందించడంపై దృష్టి సారించిందని మంత్రిత్వ శాఖ ప్రతినిధి జనకరాజ్ దహల్ చెప్పారు. వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న బాధితుల‌ను ర‌క్షించేందుకు స‌హాయ‌క బృందాలు శ్ర‌మిస్తున్నాయి. ప్ర‌ధానంగా పర్వతాలపై మంచు కరగడంతో సింధుపాల్‌చోక్‌, మనంగ్‌ జిల్లాల్లో వరద పోటెత్తిందని .. భారీగా నష్టం వాటిల్లింది. ఇంద్రావతి, మేలమ్చి నదుల్లో నీటి మట్టం పెరిగిందని తెలిపారు. ప‌లు ప్రాంతాల్లో స్తంభాలు, భారీ చెట్లు నేలకూలాయి.

ప్రతి సంవత్సరం వర్షాకాలంలో నేపాల్‌లో కొండచరియలు, వరదలు వందలాది మంది చనిపోతున్నారు. దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో.. స్థానిక పరిపాలన అధికారులు నోటీసులు జారీ చేశాయి. ప్రజలను సురక్షితంగా ఉండమని హెచ్చరించాయి. తమకోషి నది కి వరద సంభవించే అవకాశం ఉందని.. నదీ తీరం సమీపంలో నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ముందస్తు హెచ్చరికలను జారీ చేసింది నేపాల్ ప్రభుత్వం.

Also Read: మాతా వైష్ణవి టెంపుల్, హరిద్వార్, ఢిల్లీ సహా ప్రముఖ ప్రాంతాల పర్యటన రైల్వే ప్రత్యేక ప్యాకేజీతో రైలు..